Ennenno Janmala Bandham: మాళవికను డిసప్పాయింట్ చేసిన ఖుషి.. కిడ్నాప్ వ్యవహారం చూసేసిన వేద?

Published : Jun 21, 2023, 11:25 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన భర్త మొదటి భార్య మీద జాలిపడి తన కాపురానికే చేటు తెచ్చుకుంటున్న ఒక అమాయకపు ఇల్లాలి కథ  ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Ennenno Janmala Bandham: మాళవికను డిసప్పాయింట్ చేసిన ఖుషి.. కిడ్నాప్ వ్యవహారం చూసేసిన వేద?

ఎపిసోడ్ ప్రారంభంలో ఖుషి వేద గురించి అంత గొప్పగా మాట్లాడటాన్ని భరించలేక పోతుంది మాళవిక. తను నా కూతుర్ని ఎంత మాయ చేసి ఉంటే వేద గురించి అంత గొప్పగా మాట్లాడుతుంది ఇంక నా వైపు ఎందుకు చూస్తుంది నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది. ఇదే గనక కంటిన్యూ అయితే ఈ ఇంట్లో నేను అనుకున్నది సాధించలేను అనుకుంటుంది మాళవిక.
 

28

అప్పుడే అటువైపుగా వచ్చిన వేద మళ్ళీ ఇక్కడెందుకు కూర్చున్నావు అవతల నీ కూతురు కేక్ కట్ చేస్తుంది అని చెప్పి బలవంతంగా ఆమెని అక్కడ నుంచి తీసుకువెళ్తుంది వేద. అది చూసిన గెస్ట్లు ఆ వెళుతున్నది యష్ మొదటి భార్య కదా వెళ్ళిపోయింది కదా అయినా మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నారేంటి. యష్ ఇప్పుడు ఇద్దరితోనూ ఉంటాడా ఏంటో ఈ జనాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.

38

అయినా మొదటి భార్య వచ్చిందంటే రెండో భార్య గతి ఏమవుతుందో.. ఇంట్లో పెద్దవాళ్లకైనా బుద్ధి ఉండక్కర్లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న యష్ సిగ్గుతో చితికిపోతాడు. వీళ్లే ఇలా మాట్లాడుకుంటున్నారంటే బయట వాళ్ళు ఇంకెలా మాట్లాడుకుంటున్నారో అయినా మాళవిక నీ ఇంట్లోకి తెచ్చే విషయంలో వేద కి సపోర్ట్ చేయకుండా ఉండవలసింది ఎలా అయినా తనని ఇంట్లోంచి పంపించే ఏర్పాట్లు చేయాలి అనుకుంటాడు.
 

48

మరోవైపు రత్నాన్ని శర్మనీ వెతుకుతూ ఉంటాడు వసంత్. వీళ్ళకి అనవసరంగా కొబ్బరి బోండాలు ఇచ్చాను. ఎక్కడ ఏ హడావుడి చేస్తున్నారో అంటూ కంగారు పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చిత్ర ఏం వెతుకుతున్నావు అంటూ నిలదీస్తుంది. నిజం చెప్పకుండా మాట దాట వేస్తాడు వసంత్. ఇంతలో అక్కడికి వచ్చిన యష్ తను విన్నదంతా వసంత్ కి చెప్తాడు.మాళవికని నీతో తీసుకువెళ్ళు తను మీ అక్క కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటాడు యష్.
 

58

అలాగే యష్ తనని మీ ఇంట్లో చూసినప్పుడే నేను తీసుకు వెళ్దాం అనుకున్నాను కానీ వదిన ఒప్పుకోలేదు అంటాడు వసంత్. ఇప్పుడు కూడా ఒప్పుకుంటుంది అనుకోను అంటుంది చిత్ర. అందుకే తనకి నిజం చెప్పొద్దు ఫంక్షన్ అవ్వనీ ప్లాన్ చేద్దాం అంటాడు వసంత్. ఆ తర్వాత కేక్ కటింగ్ కి టైం అవుతుంది అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు. అదే సమయంలో ఖుషి ని పక్కకు తీసుకువెళ్లి ఎంతైనా మాళవిక మీ అమ్మ తనకే మొదటి కేక్ ముక్క పెట్టు బ్రతిమాలి ఒప్పిస్తుంది వేద.
 

68

అలాగే అంటూ కేక్ కట్ చేసిన ఖుషి కేక్ ముక్క మాళవిక నోట్లో పెట్టబోతుంది. కానీ వెంటనే చేతిని వెనక్కి తీసుకొని నాకు అమ్మంటే నువ్వే ఇంకెవరు నాకు అమ్మ కాదు అంటూ వేద నోట్లో కేక్ ముక్క పెడుతుంది ఖుషి. ఖుషి చేసిన పనికి డిసప్పాయింట్ అవుతుంది మాళవిక. ఇదంతా చూస్తున్న మాలిని నా కోడలు అన్ని విషయాల్లోనే నచ్చుతుంది కానీ ఈ విషయంలో మాత్రం నచ్చటం లేదు ఇప్పటికే నా మనవడిని తీసుకెళ్ళి పోతుందేమో అని భయంగా ఉంది అలాంటిది నా మనవరాల్ని కూడా  ఆ మాళవికకి దగ్గర చేయాలని చూస్తుంది అని సులోచనతో చెప్తుంది.
 

78

నాకు కూడా అదే బాధగా ఉంది కానీ ఏం చేయటం ఈ విషయంలో వేద మన మాట వినటం లేదు అంటుంది సులోచన. ఆదిత్య చెల్లెల్ని హగ్ చేసుకుని మనస్పూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్తాడు. ఇదంతా చూస్తున్న కైలాష్ మనం ఫంక్షన్ చూసి ఎంజాయ్ చేయటానికి వచ్చామా లేక చేసేది ఏమైనా ఉందా అని అభి ని అడుగుతాడు. ఏదైనా చేయటానికి టైం కావాలి కదా వెయిట్ చేద్దాం అంటాడు అభి. మరోవైపు మళ్లీ కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు రత్నం, శర్మ.

88

అప్పుడే అక్కడికి వచ్చిన మాలిని సులోచన ఫంక్షన్ అక్కడ జరుగుతుంటే మీరిద్దరూ ఎక్కడ ఏం చేస్తున్నారు అయినా ఈ కొబ్బరి బోండాల్లోనే ఏదో ఉంది ఇందాకటి నుంచి చేత్తో పట్టుకొని తిరుగుతున్నారు ముందు వాటిని కాళీ చేసేయాలి అనుకుంటూ భర్తల దగ్గర తీసుకొని ఆ బోండాలు తాగేస్తారు మాలిని, సులోచన. తరువాయి భాగంలో ఆదిత్య ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు అభి, కైలాష్. అది చూసిన ఖుషి వాళ్లని అడ్డుకుంటుంది. నా పెనుగులాటలో ఆదిత్య నీ తోసేసి ఖుషి ని కిడ్నాప్ చేస్తారు అభి వాళ్ళు. ఇదంతా చూసిన వేద గబగబా అక్కడికి వస్తుంది కానీ అప్పటికే అభివాళ్లు వెళ్ళిపోతారు.

click me!

Recommended Stories