Guppedantha Manasu: చక్రపాణికి ఊహించని బహుమానం ఇచ్చిన రిషి.. జగతి కాళ్లు పట్టుకుంటానన్న శైలేంద్ర!

Published : Jun 21, 2023, 10:27 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న  గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. తన పన్నాగం బయటపడితే ప్రమాదం అని పిన్ని కాళ్లు పట్టుకుంటానంటూ నటిస్తున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: చక్రపాణికి ఊహించని బహుమానం ఇచ్చిన రిషి.. జగతి కాళ్లు పట్టుకుంటానన్న శైలేంద్ర!

 ఎపిసోడ్ ప్రారంభంలో శైలేంద్ర చెప్పింది విని షాక్ అవుతుంది దేవయాని. ఏం మాట్లాడుతున్నావ్ శైలేంద్ర రిషి చనిపోయాడా.. ఎలా చనిపోయాడు ఎవరు చేశారు ఈ పని అని అడుగుతుంది. ఇంకెవరు చేస్తారు ఆ అవసరం ఎవరికి ఉంటుంది నేనే ఆ పని చేశాను ఇదే విషయాన్ని ఇంట్లో చెప్తాను. ఎవరో రౌడీలు రిషి ని చంపేశారు అని చెప్తాను అంటాడు శైలేంద్ర. ఆ పని మాత్రం చేయొద్దు.

28

 రిషి లేడు అన్నందుకే మీ పిన్ని నిన్ను కొట్టింది అలాంటిది చనిపోయాడు అని తెలిస్తే తను ఊరుకోదు మనల్ని వదిలిపెట్టదు. అంతెందుకు మీ నాన్నే ఎలా రెచ్చిపోయాడో చూసావు కదా. అయినా ఇన్నాళ్లు నువ్వు ఏది అనుకున్నావో అది చేసావు ఇప్పుడు పరిస్థితులు మన చేతిలో లేవు ఈసారికి నేను చెప్పినట్లు విను రిషి చనిపోయిన విషయం ఇంట్లో చెప్పకు అని కొడుక్కి నచ్చచెప్తుంది దేవయాని.

38

 మరోవైపు ఈరోజు రిషి సార్ తో ఎలాగైనా మాట్లాడాలి అనుకొని  కూతురితోపాటు కాలేజీకి బయలుదేరుతాడు చక్రపాణి. కాలేజీకి ఎందుకు నాన్న అంటుంది వసు. అసలు విషయం చెప్పకుండా చిన్న పని ఉందమ్మా అని చెప్పి కూతురుని ఒప్పించి ఆమెతోపాటు కాలేజీకి వస్తాడు చక్రపాణి. కాలేజీ ముందు ఆటో దిగి తండ్రికి జాగ్రత్తగా వెళ్లి రమ్మని చెప్పి కాలేజీలోకి వెళ్ళిపోతుంది వసు. అందులోనే రిషి రావటంతో చక్రపాణి పరుగున వెళ్లి రిషి ని పిలుస్తాడు.
 

48

 అనుకోకుండా చక్రపాణి రిషి దగ్గరికి వెళ్లడం చూస్తుంది వసు. ఈయన ఎందుకు సార్ ని కలుస్తున్నారు రిషి సార్ కోప్పడతారేమో అనుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది. చక్రపాణి చూసిన రిషి మీ అమ్మాయి మిమ్మల్ని రాయబారం పంపించిందా దయచేసి అలాంటివి పెట్టుకోకండి నేను ఇప్పుడు కేవలం రిషి ని మాత్రమే అంటూ చక్రపాణితో కటువుగా మాట్లాడుతాడు రిషి.

58

 నేను తప్పు చేయలేదు కదా బాబు నాకు మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వండి అని చక్రపాణి అడిగినా అతనితో మాట్లాడుటానికి ఇష్టపడడు. అంతేకాకుండా మరెప్పుడూ కలవటానికి ప్రయత్నించకండి నన్ను చూసినట్లు కూడా ఎక్కడా ఎవరికీ చెప్పకండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. రిషి మాటలకి కన్నీరు పెట్టుకుంటాడు చక్రపాణి. అతని బాధ చూడలేక రిషి దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు అంత కటువుగా మాట్లాడటం.
 

68

ఆయన ఏమి తప్పు చేయలేదు కదా అయినా మీరు ఇచ్చిన బహుమతికి మళ్ళీ ఆయన మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయరు. కారణం లేకుండా ఆయనకి కన్నీరు బహుమతి ఇచ్చారు అని అని నిష్టూరంగా మాట్లాడుతుంది వసు. ఒక కూతురుగా ఆయన బాధ నీకు అర్థమైంది కానీ ఇన్నాళ్లుగా నేను పడుతున్న బాధ ఎవరితో చెప్పుకోవాలి అని చెప్పి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత జరిగిన దానిని తలుచుకుని రిషి వసుధార ఇద్దరు బాధపడుతూ ఉంటారు.

78

ఇంతలో రిషికి ఏంజెల్ ఫోన్ చేసి షాపింగ్ కి వెళ్దాం  రమ్మంటుంది. నేను రాలేను నాకు మూడ్ బాలేదు అంటాడు రిషి. ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటావు అడిగితే కారణం చెప్పవు. సరే నీ ఇష్టం నేనైతే షాపింగ్ కి వెళ్తున్నాను. ఇంటిదగ్గర విశ్వం ఒక్కడే ఉన్నాడు వీలైతే వెళ్లి పలకరించు లేదంటే ఎంజాయ్ యువర్ లోన్లీనెస్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంజెల్. మరో వైపు జగతి దగ్గరికి వచ్చిన శైలేంద్ర ఆమెకి సారీ చెప్తాడు. అంతలోనే అక్కడికి మహేంద్ర రావడంతో అతనికి కూడా సారీ చెప్తాడు.
 

88

 అవసరమైతే పిన్ని కాళ్ళు పట్టుకుంటాను అంటాడు. భర్త యాక్టింగ్ చూసి దీని వెనక ఏం కారణం ఉందో అనుకుంటుంది ధరణి. చేసిన తప్పు తెలుసుకున్నావు అంతే చాలు ఇంకెప్పుడూ రిషి గురించి ఆపశకునాలు మాట్లాడొద్దు అంటాడు ఫణీంద్ర. మనం మిషన్ ఎడ్యుకేషన్ పనులు మీద దృష్టి పెట్టాలి రిషి మధ్యలో వదిలేసిన పనులు మనం పూర్తి చేయాలి రిషి గౌరవాన్ని నిలబెట్టాలి అని మహేంద్ర తో చెప్తాడు ఫణీంద్ర. అలాగే అంటాడు మహేంద్ర. ఈ ప్రాజెక్టులో నేను కూడా పాల్గొంటాను నా తెలివితేటలు ఉపయోగించి రిషి ప్లేస్ ని రీప్లేస్ చేస్తాను అంటాడు శైలేంద్ర. అందుకు కోప్పడుతుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories