ఆ తర్వాత యష్ కి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వేద కూడా క్లినిక్ కి వెళ్ళాలి అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వేద, యష్ కి కోటు తొడిగిస్తూ ఉండగా అప్పుడు వాళ్లిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.. అప్పుడు బాగా నటిస్తున్నందుకు వేద, యష్ ఒకరికొకటి థాంక్స్ చెప్పుకుంటారు. అందరూ సంతోషంగా ఉండాలి కదా అనగా అందులో నేను లేనా అని అడగడంతో ఇంకా ఎన్ని రోజులు అడగగా తెలియదు అని అంటాడు యష్. అప్పుడు వేద మనసులో ఉన్న ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా కేవలం ఖుషి కోసమే మనం ఇలా చేస్తున్నాం కదా అని మాట్లాడడంతో వేద బాధగా మాట్లాడుతుంది.