
ఈరోజు ఎపిసోడ్ లో పీటర్ ని చూసి మల్లిక ఈ పిచ్చోడిని ఎలాగోలా మాయమాటలు చూపి ఇంటికి తప్పించాను ఇప్పుడు ఇతను ఎలాగో అలా జెస్సిని పిలుచుకొని వెళ్తే నేను కూడా మా ఆయనను పిలుచుకొని ఇకనుంచి వెళ్ళిపోతాను అనుకుంటూ ఉంటుంది మల్లిక. ఇంతలోనే జెస్సి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అప్పుడు పీటర్ వెళ్లి బట్టలు సర్దుకో అమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం అనడంతో జెస్సి తో పాటు అక్కడ అందరూ షాక్ అవుతారు. అప్పుడు గోవిందరాజులు వచ్చిన దగ్గరనుంచి మాతో ఏం మాట్లాడకుండా ఇప్పుడు జెస్సిని పిలుచుకొని వెళ్తాను అంటారేంటి అని అంటాడు. ఏం మాట్లాడాలండి మీ మీద నమ్మకంతో నా కూతురు సంతోషంగా ఉంటుంది అని నేను ఇటువైపు రాలేదు.
అఖిల్ కి ఉద్యోగం లేకపోయినా కూడా ఉన్నతమైన కుటుంబం అని మీ ఇంటికి కోడల్ని చేశాను అనడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇల్లు అని అమ్ముకొని ఇలా రోడ్డున పడి ఇలాంటి ఇంట్లో ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా నాతో ఒక్క మాట అయినా చెప్పారా అని అంటాడు పీటర్. అప్పుడు జ్ఞానాంబ మాకు అనుకోని కష్టాలు వచ్చాయి అవి చెప్పి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలన్న ఉద్దేశంతో చెప్పలేదు అంటుంది. ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినను నా కూతుర్ని నాతోపాటు తీసుకెళ్తాను అందులోను ఇప్పుడు జెస్సీ ప్రెగ్నెంట్ కాబట్టి తనని మా ఇంటికి పిలుచుకొని వెళ్తాను అంటాడు పీటర్. అప్పుడు జ్ఞానాంబ మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము అనడంతో నాకు నమ్మకం లేదు అంటాడు పీటర్.
అప్పుడు మల్లిక నమ్మకం లేనప్పుడు మీ అమ్మాయిని ఇక్కడ ఉంచడం ఎందుకు లేండి చికిత వెళ్లి తీసుకురా బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది అని అనడంతో మల్లిక అని అరుస్తుంది జ్ఞానాంబ. జెస్సీ వెళ్ళాం కదా అని పీటర్ అనడంతో రమ్మంటే రావడానికి నేను నీ కూతుర్ని కాదు ఇంటి కోడల్ని మా అత్తయ్య గారు వెళ్ళమంటే వస్తాను అనడంతో పీటర్ షాక్ అవుతాడు. ఇక్కడ కష్టాలు పడే బదులు మనం వెళ్లిపోదాం పదమ్మ అనడంతో ఎవరు చెప్పారు నాన్న నేను కష్టాలు అనుభవిస్తున్నానని నీకు చాలా సంతోషంగా ఉన్నాను ఏ పని చేయడం లేదు అంటుంది. నీ కూతురు ఇల్లు మాత్రమే మారింది వాళ్ళు నాపై చూపించే ప్రేమ మారలేదు అంటుంది. నువ్వు ఏదో మాయలో ఉన్నావు ఇంట్లో ఏముంది ఇంకొక నలుగురు నిలబడడానికి కూడా లేదు నా మాట విని వెళ్దాం పద అనడంతో జెస్సి నేను రాను నాన్న అని అంటుంది.
ఇక్కడ నన్ను అందరూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు జానకి అక్క ఇదే తన కన్నా బిడ్డ లాగా చూసుకుంటుంది మల్లి మీ ఇంటికి వస్తే ఏమిస్తారు నాన్న కొత్తగా అని అంటుంది జెస్సి. పండక్కి పిలవండి నేను అత్తయ్య గారి వారి పర్మిషన్ తీసుకుని వస్తాను అంతేకానీ ఇలా కూతురిగా తీసుకెళ్లాలంటే ఇంటికి రాకండి అని అంటుంది. అప్పుడు పీటర్ ఏం మాట్లాడాలో తెలియక జానకి దగ్గరికి వెళ్లి నువ్వే కదమ్మా నా కూతురికి పెళ్లి చేశావు అండగా ఉంటే నా కూతుర్ని బాగా చూసుకుంటా అనుకున్నాను ఇలా చేస్తావని అనుకోలేదు. మా గొంతు కోశావు అని అంటాడు పీటర్. నా కూతురు రమ్మంటే నన్ను వెళ్లిపోమంటోంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు పీటర్. అప్పుడు మల్లిక నేను అనుకున్నది ఏం జరగలేదు అనుకుంటూ తల బాదుకుంటూ ఉంటుంది మల్లిక.
అప్పుడు ఎప్పుడు లేనిది వియ్యంకులు వారితో మాట పడాల్సి వచ్చింది అంటే మనం ఏ స్థాయికి దిగజారి పోయామో అర్థం అయ్యేవరకు అర్థమైతే చాలు అని జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జ్ఞానకి పని చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలోనే ఎక్కడికి రామచంద్ర వస్తాడు. జెస్సి వాళ్ళ నాన్న మాట్లాడిన తీరు నాకే నచ్చలేదండి మిమ్మల్ని అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధగా ఉంది అంటాడు రామచంద్ర. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు జెస్సీ, అఖిల్ మాట్లాడుకుంటూ ఉండగా అఖిల్ నీ అంతటి నువ్వు నిర్ణయాలు తీసుకోవడమేనా మీ నాన్నతో పాటు నువ్వు వెళ్లొచ్చు కదా అనగా మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను అని అంటుంది జెస్సి. ఇప్పుడు అఖిల్ విసుక్కుంటూ నువ్వెక్కడ దొరికావే నాకు పుట్టింటికి పోయి లక్షణంగా ఆనందంగా ఉందామంటే ఇక్కడే ఉందాము అంటున్నావు అని అంటాడు అఖిల్.
అసలు నిన్ను కాదే నిన్ను ఇలా తయారు చేసిన మా పెద్ద వదినని అనాలి అని అనగా ఇంతలోనే జానకి అక్కడికి రావడంతో అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జానకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. ఆ మాటలు అన్ని విన్న గోవిందరాజులు కంటతడి పెట్టుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నారు మామయ్య గారు అఖిల్ అన్నా అన్నాడని బాధపడుతున్నారా అని అంటుంది జానకి. నిన్ను వాడు అన్ని మాటలు అంటున్నా నీకూ బాధ లేదు అంటున్నావు నువ్వు నిజంగానే దేవతవి జానకి అంటాడు గోవిందరాజులు.
మరొకవైపు గుడిలో రామచంద్ర జానకి పనులు చేస్తూ ఉండగా అదే గుడికి జ్ఞానాంబ మల్లిక ఇద్దరు వెళ్తూ ఉంటారు. అప్పుడే జ్ఞానాంబ గుడిలోకి వెళ్లి దేవుడితో తన బాధను చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక తన కుటుంబ విషయాలు పూజారికి చెప్పడంతో జ్ఞానాంబ కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ వాళ్లు దేవుడికి మొక్కుకుంటూ ఉండగా పక్కనే ఉన్న రామచంద్ర వాళ్ళు క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ ఇంటికి వెళుతుండగా ఇంతలోనే ఒక ఆమె వచ్చి జ్ఞానాంబ తన మనబడి బర్త్డే అని ఆశీర్వదించమని అడుగుతుంది.