అజిత్‌ కు 30 లక్షల గిఫ్ట్.. ప్రపంచంలోనే మొదటి ఫార్ములా E థీమ్ SUV ఇదే

Published : Mar 14, 2026, 10:55 AM IST

కార్ రేస్‌లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన నటుడు అజిత్ కుమార్‌కు అదిరిపోయే గిఫ్ట్ అందింది. దుబాయ్ నుంచి తిరిగి రాగానే, మహీంద్రా కంపెనీ తన సరికొత్త ఫార్ములా E థీమ్ SUVని ఆయనకు బహుమతిగా ఇచ్చింది.

PREV
13
దుబయ్ లో చిక్కుకున్న అజిత్..

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం వల్ల దుబాయ్ లో చాలామంది సామాన్యులు, సెలబ్రిటీలు చిక్కుకున్నారు. ఇరాన్  కేవలం ఇజ్రాయెల్‌పైనే కాకుండా, అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈలపై కూడా క్షిపణి దాడులు చేసింది. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. 

ఆ సమయంలో కార్ రేస్ కోసం దుబాయ్‌లో ఉన్న అజిత్, ఈ టెన్షన్ వల్ల వెంటనే చెన్నైకి తిరిగి రాలేక కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత, అజిత్ పూర్తిగా సురక్షితంగా ఉన్నాడని అతని మేనేజర్ సురేష్ చంద్ర అభిమానులకు భరోసా ఇచ్చారు.

23
అజిత్ కు 30 లక్షల భముమతి..
కొన్ని రోజుల క్రితం, నటుడు అజిత్ సురక్షితంగా చెన్నైకి తిరిగి వచ్చాడు. అతను చెన్నైకి రాగానే ఒక ప్రత్యేకమైన బహుమతి అందుకున్నాడు. కార్ రేసింగ్‌పై అజిత్‌కు ఉన్న ఆసక్తిని మెచ్చుకుంటూ, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ విభాగం హెడ్ వేలుస్వామి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫార్ములా E థీమ్ SUV కారైన 'మహీంద్రా BE ఫార్ములా E ఎడిషన్‌'ను అజిత్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. విశేషమేమిటంటే, ఈ కారు లాంచ్ ఈవెంట్‌లో నటుడు అజిత్ కూడా పాల్గొన్నాడు.
33
అజిత్ నెక్ట్స్ సినిమా అప్ డేట్..?

నటుడు అజిత్ చివరిగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా విజయం తర్వాత, అజిత్ తన తదుపరి చిత్రానికి కూడా ఆధిక్ రవిచంద్రన్‌కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. 

ఈ చిత్రం హార్బర్ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా కోసం నటుడు అజిత్ 160 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories