Brahmamudi Serial Today Episode: ఇందుకు ఇచ్చే డ్రింక్‍లో మత్తు మందు కలిపిన బాస్.. ఐశ్వర్యను పటాయించిన రాజు

Published : Mar 14, 2026, 10:32 AM IST

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. కావ్యపై పగతో ఇందును ఇబ్బంది పెడుతుంది రేఖ. ఇందుకు ఇచ్చే డ్రింక్‍లో మత్తుమందు కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు రాఖీ. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

PREV
17
ఇందును ఇంటర్య్వూ పేరుతో ఇబ్బంది పెడుతున్న రాఖీ

ఇందు, బాస్ రాఖీ పబ్‍లో మాట్లాడుతుంటారు. నాకు ఇలాంటి పార్టీలు అలవాటు, వెళ్తూ ఉంటాను.అక్కడ నేను తాగుతూ ఉంటా. నా పీఏ అలెర్ట్ గా ఉండాలి, తనకు తాగే అలవాటు ఉండకూడదు. నీకు ఆ అలవాటు ఉందో లేదో టెస్ట్ చేశా అంటాడు బాస్. మీలో ఉన్న స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటని ఇందును అడుగుతాడు. కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడటం, ఏదైనా పని మొదలుపెడితే పూర్తయ్యేవరకూ పనిచేయడం అని చెప్తుంది. నైట్ టైం వర్క్ చేయడం మీకు ఓకేనా అని అడుగుతాడు రాఖీ. అయ్యో సర్...నైట్ టైం బయటకు రావడానికి కుదరదు...ఎంత వర్క్ ఉన్నా ఇంటి దగ్గర నుంచి పూర్తి చేస్తా అంటుంది.నువ్వు ఎక్కడి నుంచి పనిచేస్తావన్నదానికంటే...టైంకు పని పూర్తి అయితే చాలని అంటాడు రాఖీ. మరి మన పని ఎలా అవుతుందని రాఖీ ఫ్రెండ్ సైడ్ డైలాగ్ వేస్తాడు. వెంటనే రాఖీ అతన్ని తిడతాడు. అవును ఇందు పని విషయంలో చెప్పింది ఫాలో అవుతావా...సొంత డెసిషన్ తీసుకుంటావా అని అడుగుతాడు రాఖీ. సొంతంగా ఆలోచించి, మీ నిర్ణయంలో తప్పులు ఉంటే సరిదిద్దుతా సర్ అంటుంది ఇందు. వెరీగుడ్ నేను చెప్పింది చేసేవాళ్లు నాకెందుకు...నా తప్పులు సరిదిద్దే వాళ్లే నాకు కావాలంటాడు రాఖీ. ఎక్సెపీరియన్స్ లేదు, కమ్యూనికేషన్ కూడా లేదు అంటాడు రాఖీ. ఇందు కంగారుపడి నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అంటుంది. నాతో పనిచేయడానికి నీకిష్టమేనా అంటాడు రాఖీ. మిమ్మల్ని చూసి భయపడితే పనేలా చేస్తా అంటుంది. ఇంకా లాస్ట్ రౌండ్ ఉంది, నువ్వు టెన్షన్ పడుతున్నావ్...నీకోసం జ్యూస్ చేసి తీసుకొస్తాలే అంటాడు రాఖీ.

27
ఆస్తి లెక్కలు వేస్తున్న రేఖ

ఇక అటువైపు రేఖ ఏవే పేపర్లు చూస్తుంటుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి ఇంత రాత్రైనా వర్క్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఇందు సంతకం పెట్టాక మన చేతికి వచ్చే ఆస్తి విలువెంతో, ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నా. అమ్మో వీళ్ల ఆస్తులు వైజాగ్, విజయవాడలో కూడా ఉన్నాయా అని భ్రమరాంబ అంటుంది.ఢిల్లీలో కూడా ఉన్నాయంటూ రేఖ అంటుంది. వాళ్లు అంత సంపాదించారా అని భ్రమరాంబ అంటే... లేకపోతే మా అమ్మ ఎందుకు అంతలా కష్టపడుతుంది, ప్రాణాలకు తెగించి ఎందుకు ఆశ పడుతుంది అని రేఖ అంటుంది. ఇంత ఆస్తి కోసం ఇన్నేళ్లు ఎదురుచూడటం తప్పే లేదంటుంది భ్రమరాంబ, అవును రేఖ...ఇందును చదివించకుండా, బయటికి పంపకుండా ఉంచావ్ కదా...రేపు నువ్వు అడిగిన వెంటనే సంతకం పెడుతుందా అంటుంది. సంతకం పెట్టదు, ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి, వేలిముద్ర పెడుతుందని రేఖ అంటుంది. అప్పుడు భ్రమరాంబ గట్టిగా నవ్వుతుంది. 

37
ఇందు కోసం టెన్షన్ పడుతున్న అపర్ణ

ఇక అటు అపర్ణ....ఇందు ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంది. ఎందుకు నాన్నమ్మ ఇంత టెన్షన్ పడతావ్ అని స్వాతి అంటుంది. వాళ్లకు ఆకలేసినా, దాహం వేసినా నా మనవరాలే గుర్తుకొస్తుందని అపర్ణ అంటుంది.  

47
కావ్యపై పగ తీర్చుకుంటానన్న రేఖ

ఆస్తి మన చేతికొచ్చాక కూడా ఈ గుంపును మనం భరించాలా అంటుంది భ్రమరాంబ, భరించాలి వదిన..ఆ ఇందు నా కాళ్ల దగ్గర పడి ఉండాలని రేఖ అంటుంది. ఇందు మీద అంత కోపం ఎందుకు అని భ్రమరాంబ అంటే...ఆ కావ్య మా అమ్మను చంపింది, కావ్య చచ్చినా, ఆ పగ పోలేదు. అందుకే కావ్య మీద పగను ఇందు మీద తీర్చుకుంటా, ప్రతిక్షణం ఇందుకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటుంది రేఖ. పగను తీర్చుకునే అవకాశం నీకు వచ్చినట్లు ప్రపంచంలో ఎవరికీ దొరకదు అంటుంది భ్రమరాంబ. మరి ముసలాళ్ల సంగతేంటి అంటుంది భ్రమరాంబ, కావ్య మన మాట వినాలంటే...ఆ ముసలాళ్లు ఉండాలి, లేదంటే మన మాట వినదని రేఖ అంటుంది. ఇంతలో రేఖ పొలమారి నీళ్ల కోసం ఇందును పిలుస్తుంది. కానీ అపర్ణ నీళ్లు తెస్తుంది.

57
ఐశ్వర్యతో నైస్‌గా మాట్లాడి నంబర్ తీసుకున్న రాజు

అటు పబ్‍లో నందు, వెంకీ...ఐశ్వర్య, తన ఫ్రెండ్స్...రాజు అతని ఫ్రెండ్ డాన్సులు వేస్తూ చిల్ అవుతుంటారు. వెంకీ ఐశ్వర్య నంబర్ అడిగేందుకు ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఐశ్వర్య దగ్గర ఆటలు సాగక మొహం మాడ్చుకుంటాడు. కానీ రాజు మాత్రం ఆ అమ్మాయిని పటాయించి నంబర్ తెస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. రాజు ఐశ్వర్యతో నైస్‌గా మాట్లాడి నంబర్ తీసుకుంటాడు. 

67
అనుమానం రాకుండా ఇందు ప్లేస్‍లో పడుకున్న స్వాతి

మరోవైపు ఇందును పిలిస్తే అపర్ణ నీళ్లు తీసుకొస్తే...నువ్వు తెచ్చావేంటీ అని రేఖ, భ్రమరాంబ అంటుంది. పొద్దున్నుంచి దాని కష్టపెట్టింది చాలదా...ఇప్పుడు కూడా కష్టపెట్టాలా అని అంటుంది అపర్ణ. శివరాం ఇంటికి పంపిస్తున్నామని నీకు బాగా కోపంగా ఉన్నట్టుంది అని భ్రమరాంబ అంటుంది. అయినా కూడా పిలిస్తే వస్తుంది కదా అంటుంది రేఖ. అది ఉండగా నీతో పనిచేయించదు అంటుంది. ఇంతకీ ఇందు ఉంట్లో ఉందా అని అంటుంది భ్రమరాంబ. పడుకుని ఉందని చెప్తుంది అపర్ణ. నువ్వేళ్లి చూసి రా అని రేఖ అంటుంది. భ్రమరాంబ వెళ్తుంటే అపర్ణ కంగారు పడుతుంది. భ్రమరాంబ తలుపు తీసి చూసేసరికి స్వాతి దుప్పటి కప్పుకుని పడుకుని ఉండటంతో చూసి ఇందునే అనుకుంటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అర్జెంటుగా ఇందుకు ఫోన్ చేయ్ అంటుంది అపర్ణ, మనం టెన్షన్ పడుతున్నామని, అక్కని టెన్షన్ పెట్టడం ఎందుకని స్వాతి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

77
ఇందుకు ఇచ్చే డ్రింక్‍లో మత్తుమందు కలిపిన రాఖీ

అటు పబ్‍లో ఇందు కోసం డ్రింక్ ఆర్డర్ చేస్తాడు రాఖీ. పక్కా ఫ్యామిలీ అమ్మాయిలా ఉంది, మానమాట వింటుందా అని ఫ్రెండ్ అడుగుతాడు. మత్తులో ఉంటే వింటుందని మత్తు మందు డ్రింక్‍లో కలుపుతాడు రాఖీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories