రెండు రోజుల తర్వాత ,జగతి మహీంద్రలు కూర్చుని చివరి పరీక్ష అయిపోతే మళ్ళీ రిషి వసు కలిసే అవకాశం లేదు అని బాధపడతారు. అప్పుడు జగతి ఏమవ్వదు మహేంద్ర, వసు ఎక్కడికి వెళ్తుంది ఇక్కడే ఉంటుంది కదా అని అంటుంది. ఇంతలో రిషి గౌతమ్ లు కిందకు దిగుతారు కొంచెం కాఫీ తాగి వెళ్దాము అని అంటాడు మహేంద్ర.ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది. ధరణి, కాఫీ కావాల అని అడగగా వద్దు అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి పెద్దమ్మ, పరీక్షలు అయిపోయిన తర్వాత మీకు ఒక శుభవార్త చెబుతాను అని అంటాడు. ఏంటి అది అని అనగా, వసుధార పరీక్షలు బాగా రాస్తాది కదా తన గురించి ఇంక దేని గురించి అని అంటాడు.