Karthika deepam: నా భర్తను జాగ్రత్తగా చూసుకో.. మోనితకు కార్తీక్ బాధ్యతలు అప్పగించిన వంటలక్క!

First Published | Aug 31, 2022, 9:30 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 31వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... అసలు ఈవిడెవరు అని కార్తీక్ మొనితని అడగగా పేరు పెట్టి పిలిస్తే పరిచయం ఉన్నట్టేనా కార్తీక్, డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి వాళ్ళు వస్తారు అని మొనిత అంటుంది. అప్పుడు దీప, నేను నా భర్త కోసం వచ్చాను అని తాళి చూపిస్తుంది. మీరు నా భర్త మనకు పిల్లలు ఉన్నారు హిమా,సౌర్య. మనం విహారానికి ఈ ఊరు వస్తే మనకి యాక్సిడెంట్ అయింది అని జరిగిన గతమంతా చెప్తుంది. కార్తీక్ తల పట్టుకుని ఆలోచించడానికి చూస్తాడు.
 

ఇంతట్లో మొనిత,కార్తీక్ కి గతం గుర్తొస్తుంది ఇలా భయపడి, ప్రతి ఒక్కరూ ఇంటికి వస్తుంటే ఏం చేస్తున్నావ్ శివ,తినను బయటకు తేసుకెల్లు అని బలవంతంగా దీప ని బయటికి పంపించేస్తుంది, కార్తీక్ ని ఇంట్లోకి పంపించేస్తుంది. ఆ తర్వాత శివ బలవంతంగా దీప ని బయటికి తీసుకెళ్తాడు ఇంతట్లో మొనిత బయటికి వచ్చి శివ నువ్వు వెళ్లి టాబ్లెట్లు తీసుకురా నేను దీని సంగతి చూస్తాను అని అంటది. టాబ్లెట్లు ఏంటి అని దీప అడగా, కార్తీక్ జ్ఞాపకాలలో నుంచి నిన్ను తీసేయడానికి నేను మాత్రమే ఉండడానికి.
 


ఇంక కార్తీక్ కి నువ్వు, ఈ కుటుంబం ఎవరూ గుర్తుండరు కేవలం మొనిత మాత్రమే అని అనగా మా ఇద్దరి మధ్య ప్రేమ డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేలా చేస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడున్నారు అని భయపడ్డాను ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసింది కదా ఖచ్చితంగా నా డాక్టర్ బాబు ని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని అంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా కార్తీక్ నా వాడే అని మొనిత అనగా నీకు అంత నమ్మకం ఉంటే డాక్టర్ బాబుని ఇక్కడ ఉంచు నేను మళ్ళీ వస్తాను నేను వచ్చేవరకు డాక్టర్ బాబు జాగ్రత్త అని నవ్వుతూ వెళ్తుంది.
 

మొనిత ఆలోచిస్తూ తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో కార్తీక్ ఆవిడ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతట్లో మొనిత అక్కడికి వచ్చి ఏమీ ఆలోచిస్తున్నావు  కార్తీక్ అని అడుగుతుంది.  ఇందాక సంఘటన  గురించి ఆలోచిస్తున్నాను అని కార్తీక్ అంటే, ఎవరో ఏడుస్తూ నువ్వు తన భర్త అంటే అది నువ్వు నమ్మేస్తావా కార్తీక్ అని అంటుంది. అప్పుడు కార్తీక్,నువ్వు కూడా ఏడుస్తూ నేను నీ భర్తను అంటేనే కదా నమ్మాను ఒకవేళ నీ కన్నా ముందు తను వస్తే నేను తను చెప్పింది నమ్మేదాన్ని కదా! అయినా నాకు గతం గుర్తొచ్చే వరకు ఏది మంచో ఏది చెడు అని చెప్పలేను అని అంటాడు.
 

అప్పుడు మోనిత, కార్తీక్ నన్ను ఇంకా తన భార్యగా నమ్మడం లేదు, దీపు మళ్ళీ మళ్ళీ వస్తే ప్రమాదమే,ఎలాగైనా దీప ని కార్తీక్ నుంచి దూరం చేయాలి అని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో దీప ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా తన అన్నయ్యకి, అమ్మకి చెప్తుంది అప్పుడు ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ, నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కాని తిను చాలా హద్దులు దాటుతుంది. పరాయి వారి భర్తని తన భర్తని చెప్పడం ఏంటి అని అంటుంది.
 

ఇంతట్లో దీప నిజంగానే గతం మర్చిపోవడానికి మందులు ఉంటాయా అన్నయ్య అని అడగగా ఒక డ్రగ్ ఉన్నది మార్కెట్ లో దొరకదు కానీ తను డాక్టర్ కదా తను ఎలాగైనా సంపాదించుకోవచ్చు అని అంటాడు. దానివల్ల మనిషి పూర్తిగా గతం మర్చిపోతాడా అనీ దీప అనగా పూర్తిగా మర్చిపోయే అవకాశం లేదు కానీ కొంచెం కాలం వరకు అది పనికొస్తుంది కానీ ఎప్పటికప్పుడు డ్రాగ్ ఇస్తూ ఉంటే మాత్రం మనిషి ఆరోగ్యానికి ప్రమాదమే అని అనగా మరి గతం గుర్తు రావడానికి ఏమైనా మందులు ఉన్నాయా అని దీప అడుగుతుంది.
 

నీ ప్రేమ చాలు దీప దానికి మందులు ఏమి అవసరం లేదు మళ్లీ నువ్వు కార్తీక్ దగ్గరవు నీ ప్రేమను నువ్వే సంపాదించుకోవాలి అంటారు. ఆ తర్వాత సీన్లో కార్తీక్ ఇంట్లో పేపర్ చదువుతూ ఉండగా మొనిత అక్కడికి వెళ్లి ఇన్ని రోజులు నేను నీ భార్యని అని చెప్పడమే తప్ప ఎప్పుడూ నువ్వు నాకు భర్తగా ప్రవర్తించలేదు. ఏదో ఒకటి చేయాలి అని తనకు చేయ కాలుతున్నట్టు నటిస్తూ  కార్తీక్ దగ్గరికి వెళ్తుంది మొనిత. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

Latest Videos

click me!