రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని మహేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా లవ్ సీన్స్ ను దర్శకేంద్రుడు ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా కోసం ఓ సీన్ రాసుకున్నారట రాఘవేంద్రరావు. ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి మహేష్ తో పాటు ప్రీతీజింటాను తాగమన్నారట.
ఇక హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ నేను తాగాలా అని డైరెక్టర్ రాఘవేంద్రరావు పై కోప్పడ్డారట మహేష్. అంతే కాదు అలిగి షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారట. అయితే రాఘవేంద్రరావు తో ఉన్న చనువుతోనే ఇలా చేశారట. మహేష్.. ఎందుకుంటే మహేష్ రాఘవేంద్ర రావు ను మావయ్య అని పిలుస్తారు. ఈ చనువుతోనే మహేష్ బాబు ఇలా కోప్పడి అలిగి వెల్లిపోయారట. ఇక ఆతరువాత రాఘవేంద్ర రావు మహేష్ ను బ్రతిమలాడి మళ్లీ షూటింగ్ కు తీసుకువచ్చారని సమాచారం.