Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజుకు సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన ఏఐ వీడియో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే స్పిరిట్ షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా గురించి పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వంగా షేర్ చేసిన ఒక ఏఐ వీడియో ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. మహేష్ బాబుకు బర్త్ డే విషెష్ చెబుతూ సోషల్ మీడియాని తగలబెట్టినంత పని చేశారు.
25
సూపర్ స్టార్ కృష్ణ డైలాగ్ చెప్పిన మహేష్
మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సందీప్ రెడ్డి వంగా ఒక ఏఐ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1983లో విడుదలైన సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కిరాయి కోటిగాడు సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఈ వీడియో కోసం ఉపయోగించారు. అయితే అందులో కృష్ణ కనిపించాల్సిన స్థానంలో మహేష్ బాబు ముఖాన్ని ఏఐ సాంకేతికతతో ఉంచారు. సూపర్ స్టార్ కృష్ణ మాస్ గెటప్ లో పేరు కోటిగాడు అంటూ విలన్లకు తనని పరిచయం చేసుకుంటున్న డైలాగ్ ని మహేష్ బాబు చెబుతున్నట్లు ఏఐ ద్వారా రూపొందించారు.
35
మహేష్ బాబు రిప్లై
ఈ వీడియోపై మహేష్ బాబు కూడా స్పందించారు. సందీప్ రెడ్డి వంగా చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ప్రేమతో పాటు నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. హహహా.. థ్యాంక్యూ సో మచ్ సందీప్. ఆల్ ద లవ్ టు యూ అంటూ మహేష్ బాబు స్పందించారు. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా స్పందిస్తూ ఐ లవ్ ద పోస్టర్ అండ్ డైలాగ్ అని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సోషల్ మీడియా సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ బాబు ఇలాంటి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ రెట్రో స్టైల్ లుక్ తో ఇలాంటి పాత్రలో నటిస్తే బాక్సాఫీస్ సునామీ ఖాయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పోకిరిలో ఈ తరహా పాత్రలో మహేష్ బాబు కనిపించారు. కానీ లుక్ మాత్రం అది మోడ్రన్ గా ఉంటుంది. రెట్రో లుక్ లో ఇలా కృష్ణ గారిలా కనిపించాలి అనేది అభిమానుల కోరిక.
ఇప్పటికే మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై ఉన్న ఊహాగానాలకు ఈ పరిణామం మరింత బలం చేకూర్చింది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారాణాసితో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కలిసి పనిచేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు వంగా ముందుగా ప్రభాస్‌తో చేస్తున్న స్పిరిట్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే యానిమల్ పార్క్ కూడా ఉంటుందేమో.
55
వారణాసి తర్వాత ఏంటి ?
మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ వాస్తవ రూపం దాల్చాలంటే ఈ ప్రాజెక్టులన్నింటి షెడ్యూల్స్‌ను కూడా వంగా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగా కలిసి సినిమా చేయబోతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వంగా విడుదల చేసిన ఏఐ వీడియో, ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ అభిమానుల్లో మాత్రం ఈ కాంబినేషన్‌పై మరోసారి ఆసక్తిని పెంచాయి.