Yash Net Worth: సినిమా పిచ్చితో జేబులో కేవలం రూ.300తో ఇల్లు వదిలి వచ్చిన యశ్, 'KGF'తో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు `టాక్సిక్`తో మరోసారి అలరించేందుకు వస్తున్న ఆయన ఆస్తులు ఎంతో తెలుసా?
ఈ రోజు 'రాకింగ్ స్టార్' యశ్ అంటే దేశవ్యాప్తంగా తెలుసు. కానీ ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. నటుడు కావాలనే కలతో 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశాడు. అప్పుడు ఆయన దగ్గర కేవలం ₹300 మాత్రమే ఉన్నాయని సమాచారం. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ, ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు కూడా చేశాడు. రోజుకు సుమారు ₹50 సంపాదిస్తూ, నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2004లో 'ఉత్తరాయణ' అనే కన్నడ టీవీ సీరియల్‌తో ఆయన నటన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత నాటకాల్లోనూ నటించాడు.
25
జీవితాన్ని మార్చేసిన 'KGF'!
2007లో 'జంబద హుడుగి' సినిమాలో యశ్ సహాయ నటుడిగా పరిచయమయ్యాడు. ఆ మరుసటి ఏడాదే 'రాకీ' సినిమాతో హీరోగా మారాడు. 'మొగ్గిన మనసు', 'గూగ్లీ' వంటి చిత్రాలు ఆయనకు మంచి అభిమానులను ఏర్పర్చాయి. అయితే 2018లో వచ్చిన 'KGF: చాప్టర్ 1' ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 'రాకీ భాయ్' పాత్ర ఆయన్ను కన్నడ ప్రేక్షకులను దాటి పాన్-ఇండియా స్టార్‌ను చేసింది. 2022లో వచ్చిన 'KGF: చాప్టర్ 2' విజయంతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లు దాటిన తొలి కన్నడ చిత్రంగా 'KGF: చాప్టర్ 1' రికార్డు సృష్టించింది. కేజీఎఫ్ 2 సుమారు రూ.1200కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే.
35
₹53 కోట్ల ఆస్తి.. లగ్జరీ ఇల్లు, కోట్ల విలువైన కార్లు!
ప్రస్తుతం యశ్ ఆస్తి విలువపై మీడియాలో రకరకాల అంచనాలున్నాయి. ఆయన నికర ఆస్తి విలువ సుమారు ₹53 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర వ్యాపారాలే ఆయన ఆదాయానికి ప్రధాన వనరులు. యశ్, రాధికా పండిట్ బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో ఓ లగ్జరీ డూప్లెక్స్ ఇంట్లో నివసిస్తున్నారని సమాచారం. దీని విలువ ₹4 కోట్ల నుంచి ₹6 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్‌లో రాధికా పండిట్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఆయన కార్ల కలెక్షన్‌లో మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఎస్, మెర్సిడెస్ జీఎల్‌సీ 250డి కూపే, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ 520డి, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
యశ్, ఆయన భార్య రాధికా పండిట్ కలిసి 'యశోమార్గ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, ఈ ఫౌండేషన్ చెరువుల పూడికతీత పనులు చేపట్టిందని సమాచారం. 2020లో కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన 3,000 మంది కార్మికులకు తలా ₹5,000 చొప్పున సహాయం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకే యశ్ కథ కేవలం '₹300 నుంచి ₹53 కోట్లు' సంపాదించడం మాత్రమే కాదు, సినిమా విజయం తర్వాత కూడా సామాజిక సేవపై దృష్టిపెట్టిన ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంగా చెప్పొచ్చు.
55
'టాక్సిక్'లో రాకీ భాయ్‌కి భిన్నంగా యశ్!
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ నటిస్తున్న భారీ చిత్రం 'టాక్సిక్' త్వరలో రానుంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి భారీ తారాగణం ఉంది. ఈ సినిమా విడుదల తేదీ చాలాసార్లు మారినప్పటికీ, ప్రస్తుతం 2026 ఆగస్టు 26న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. దీని తర్వాత నితేశ్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న 'రామాయణ' చిత్రంలో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై భారతీయ సినిమాలో భారీ అంచనాలున్నాయి.