అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకూ.. తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

First Published | Nov 1, 2024, 5:34 PM IST

అవ్వడానికి తెలుగు హీరోలే కాని.. ఈ టాలీవుడ్ స్టార్స్ కు తెలుగు చదవడం.. రాయడం రాదట. మరి తెలుగు సినిమాలు ఎలా చేస్తున్నారు.. తెలుగు డైలాగ్స్ ఎలా చెపుతున్నారు..? 
 

సౌత్ లో భాషాభిమానం ఎక్కువ. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్.. సావిత్రి, భానుమతి లాంటి ఆ తరం తారలు.. చిరంజీవి, బాలయ్య.. వరకూ కూడా తెలుగు లో రాయడం.. తెలుగు డైలాగ్స్ చదివి చెప్పడం లాంటివి వచ్చు.

కాని ఆతరువాత తరంలో చాలామంది హీరోలకు తెలుగు చదవడం రాయడం రాదు అని మీకు తెలుసా..? మన పక్కన రాష్ట్రాల్లో తమిళ, కన్నడ, మలయాళ స్టార్స్ భాషఆభిమానంతో వారి మాతృభాషలను మర్చిపోకుండా నేర్చుకుంటుంటే.. మన తెలుగు హీరోలు.. మాత్రం తెలుగు చదవడం రాయడం నేర్చుకోలేదు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరో తెలుసా..? 

Also Read: అందంలో తల్లి జ్యోతికను మించిపోయిన దియా, హీరో మెటీరియల్ లా సూర్య తనయుడు ఎలా ఉన్నారో చూడండి

తెలుగు రాయడం, చదవడం రాని తెలుగు హీరోలలో మహేష్ బాబు ముందు ఉన్నాడు. ఆయన చెన్నైలో పుట్టి పెరిగాడు. ఇంగ్లీష్ మీడియం చదివాడు. ఆయన తండ్రి కృష్ణ తెలుగు హీరో అయినా కూడా కొడుకుగా  టాలీవుడ్ లో కృష్టను మించిన స్టార్ డమ్ సంపాదించినా.

మహేష్ బాబు మాత్రం మాతృ భాషను నిర్లక్ష్యం చేశాడు అనే చెప్పాలి. ఆయన డైలాగ్స్ కూడా ఇంగ్లీష్ లో రాసుకుని చదువతాడట. అంతే కాదు తెలుగు చదవడం, రాయడం సూపర్ స్టార్ కు రాదు. 


ఇక అల్లు అర్జున్ ది కూడా అదే పరిస్థితి. బన్నీ కూడా మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల తెలుగులో రాయడం అల్లు అర్జున్ కు అస్సలు రాదట. ఇక చదవడం అంటారా.. అంతో ఇంతో కష్టపడి కాస్తో కూస్తో ఇప్పుడు చదవగలుగుతున్నాడట. ఇక డైలాగ్స్ అంటే తప్పకుండా ఇంగ్లీష్ లో రాసుకోవాల్సిందే అని సమాచారం. 

Also Read: విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?


South Celebrities

ఇక తెలుగు రాని హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఆయన కూడా చెన్నైలోనే పుట్టాడు కాని చిన్నతనంలోనే హైదరాబాద్ షిప్ట్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ్ కూడా స్పష్టంగా మాట్లాడుతాడు రామ్ చరణ్. కాని ముందుగా ఆయనకు తెలుగు చదవడం, రాయడం పెద్దగా రాదట. కాని ఆతరువాత కాస్తనేర్చుకుని ఇప్పుడిప్పుడే కష్టంగా అయినా చదవగలుగుతున్నాడని తెలుస్తోంది. 

Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ,

ఇక అక్కినేనివారి అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ కు కూడా ఒక్క ముక్క కూడా తెలుగు రాదట. ఇక చైతూ అయినా ఇక్కడ పుట్టాడు.. కాని అఖిల్  ఫారెన్ లో పుట్టాడు. అయినా వీరు ఇంగ్లీష్ మీడియం చదవడం.. మొదటి నుంచి తెలుగు నేర్చుకోవాలని అని తల్లీ తండ్రులు కూడా చెప్పకపోవడంతో.. రాయడం, చదవడం నేర్చుకోలేకపోయారట. దాంతో వారి డైలాగ్స్ కూడా ఇంగ్లీష్ లో రాసుకుని చెప్పుకోవడమే నని సమాచారం. 

Also Read:  CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే.. టెలికాస్ట్ ఎప్పటి నుంచో తెలుసా..?

ఇక కొడుకుల సంగతి సరే.. వారి జనరేషన్ వేరు అనుకోవచ్చు. కాని తండ్రి నాగార్జున పరిస్థితి కూడా అంతేనట. ఆయన కూడా తెలుగులో స్పస్టంగా మాట్లాడుతారు కాని.. తెలుగు రాయడం , చదవడం మాత్రం రాదట. ఈ విషయంలో క్లారిటీ లేదు కాని.. నాగార్జున తో పాటు.. వెంకటేష్ కూడా ఫారెన్ లోనే చదివి వచ్చారు. దాంతో వారికి తెలుగుపై గ్రిప్ లేదుట. వారి డైలాగ్స్ ను ఇంగ్లీష్ లో నే రాసుకునిచదువుతారని సమాచారం.  

Also Read:  స్టార్ హీరో మీద ప్రేమతో మతం మార్చుకున్న నయనతార

ఇక ఈకోవాలోకే వస్తారు మరికొంత మంది స్టార్లు.. మంచు లక్ష్మీతో పాటు.. మంచు విష్ణు, వరుణ్ తేజ్, వరుణ్ సందేష్, నిహారిక, రానా దగ్గుబాటి, సుశాంత్, హీరో శ్రీకాంత్ లకు కూడా తెలుగు రాయడం, చదవడం రాదట. ఇక  పాత తరం నటీమణులతో జయసుధ కూడా తెలుగు రాయడం , చదవడం రాదట. ఇలా తెలుగు స్టార్స్ అయ్యిండి తెలుగు రాయడం చదవడం రాకపోవడంతో పాటు.. ఇన్నాళ్లు గా నేర్చుకోకపోవడం కూడా ఎంత వరకూ సరైనదో వారికే తెలియాలి. 

Latest Videos

click me!