దేశవ్యాప్తంగా దీపావళి సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దీపావళికి సినీతారలు బాగా సందడి చేశారు. టాలీవుడ్ లో కూడా హీరోలు తమ కుటుంబాలతో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ ఎలాంటి అకేషన్ వచ్చినా అంతా ఒక్క చోట మీట్ అవుతుంటారు.
ఈ దీపావళికి కూడా మెగా హీరోలంతా ఒక్క చోట చేరారు. రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అంతా కలసి దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నారు. కానీ మెగా హీరోలో అల్లు అర్జున్ మిస్ అయ్యాడు. నిహారిక కొణిదెల ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు.
మెగా హీరోలు ఈ ఫొటోల్లో ఒక్కొక్కరు ఒక్కో లుక్ లో కనిపిస్తున్నారు. రాంచరణ్ ఆర్సీ 16 కోసం గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కూడా తన తదుపరి చిత్రం కోసం గడ్డం లుక్ లో ఉన్నాడు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లుక్స్ కూడా డిఫెరెంట్ గా ఉన్నాయి. ఈ ఫొటోల్లో నాగబాబు, ఆయన సతీమణి కూడా ఉన్నారు.
అల్లు అర్జున్ మాత్రం తన కుటుంబ సభ్యులతో దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక.. రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లతో సరదాగా ఉన్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ఉన్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే పొలిటికల్ హంగామా కూడా సాగింది. ఇప్పుడు రాంచరణ్ కేవలం వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ లతో మాత్రమే దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం మరోసారి ఫ్యాన్స్ మధ్య చర్చనీయాశం అయింది.