చిరంజీవితో రవితేజ, చిన్న మిస్ అండర్ స్టాండింగ్, సీన్ లోకి వేరే హీరో

First Published | Nov 1, 2024, 5:28 PM IST

చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే వీరిద్దరి కాంబోలో శంకర్ దాదా MBBS సినిమాలో ఒక కీలక పాత్రకు రవితేజను మొదట అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో శ్రీకాంత్‌ను ఎంపిక చేశారు.

Raviteja, Chiranjeevi,Shankar Dada M.B.B.S.


చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అంతకు ముందే వీళ్లద్దరి కాంబినేషన్ లో అన్నయ్య సినిమా కూడా వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. అంతా ఫైనల్ అనుకున్న టైమ్ లో రవితేజ ను వద్దనుకున్నారు. అయితే ఆ పరిస్దితి ఏమిటి..ఆ సినిమా ఏమిటి, రవితేజ ను వద్దనుకుని ఏ హీరోతో చిరంజీవి ఆ సినిమా చేసారో చూద్దాం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Raviteja, Chiranjeevi,Shankar Dada M.B.B.S.

 మెగాస్టార్‌ చిరంజీవితో ఇప్పటి మాస్‌ మహారాజా అప్పటి అప్‌కమింగ్‌ హీరో రవితేజ కలిసి నటించిన చిత్రం ‘అన్నయ్య’ (2000). ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చిరంజీవికి ఓ తమ్ముడిగా నటించారు రవితేజ (ఈ చిత్రంలో వెంకట్‌ మరో తమ్ముడు). అన్నతమ్ముల కెమిస్ట్రీ ‘అన్నయ్య’లో బాగానే పండింది. ఇక ఆ తర్వాత స్వయంకృషితో హీరోగా చాలా బిజీ అయ్యారు రవితేజ. 



  22 ఏళ్లకు చిరంజీవి, రవితేజ కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ అన్నతమ్ముళ్లుగానే నటించారు.    లాస్ట్ ఇయిర్  సంక్రాంతి సీజన్‌కు విడుదలైన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)) ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) సినిమాను బిగ్గెస్ట్ హిట్‌.

అప్పుడే రిలీజైన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సైతం భారీగానే కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ.. చిరంజీవి చిత్రం ముందంజలో ఉంది. దర్శకుడు బాబీ (Bobby) మెగాస్టార్‌ను ప్రజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ చిరును చూశామని సంబరపడ్డారు. కమ్ బ్యాక్ తర్వాత బాస్‌కు ఇన్నాళ్ల తర్వాత కరెక్ట్ సినిమా పడిందని ఖుష్ అయ్యారు. 


అయితే ఈ గ్యాప్ లో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాసం, అవసరం రాలేదా అంటే ఓ సారి వచ్చిందిట. హిందీలో సూపర్ హిట్ అయిన చిత్రం మున్నాభాయి ఎం.బి.బి.ఎస్ చిత్రం శంకరాదా ఎం.బి.బి.ఎస్ గా  రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెండవపాత్ర శ్రీకాంత్ పోషించాడు. అయితే ఈ పాత్ర లోకి శ్రీకాంత్ రాకముందు మొదట  రవితేజాకు సరిగ్గా నప్పుతుంది అని భావిం చారు యూనిట్ వారంతా, దర్శకుడు జయంత్తో సహా.


చిరంజీవితో నటించడానికి రవితేజా కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ.కె. అన్నాడు. రెమ్యునేషన్ విషయానికి వచ్చేసరికి, "అడిగేదేముంది? నా మార్కెట్ రేటు ఇచ్చే యండి" అన్నాడట. అంటే అనడిగితే అంటే ఏముంది? కోటిన్నర ఇవ్వండి" అని రవితేజ అన్నాడట

చిరంజీవి సరసన నటించటమే ఒక అదృష్టంగా భావించాలి. అలాంటిది అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయటమా? అన్న డైలాగ్స్ అప్పట్లో  వినిపిం చాయి. లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అప్పటి లెక్కల ప్రకారం కోటి పై చిలుకు మార్కెట్ కు ఎదిగాడు రవితేజ. అదే ఇప్పుడైతే 25 కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు రవితే. 


గతంలో చిరంజీవి 'అన్నయ్య' చిత్రంలో రవితేజ నటించాడు. అయితే ఆ పాత్ర శ్రీకాంత్ చెయ్యవలసి ఉంది. కానీ శ్రీకాంత్ డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. అప్పుడు శ్రీకాంత్ చిరంజీవితో నటించే అవకాశం పోయినందుకు చాలా ఫీలైపోయాడు. రవి తేజ, చిరంజీవితో నటించినందుకు ఆనందించాడు.

అలాంటి రవితేజ ఇప్పుడు చిరంజీవితో నటించే పాత్ర అయినా తన రెమ్యునరేషన్ తగ్గించుకోను అని చెప్పటం చిరంజీవికి కోపం తెప్పించిందని చెప్పుకుంటారు. అయితే రవితేజ మేనేజర్ చెప్పిన మాట అదని, క్యాజువల్ గా రెమ్యునేషన్ గురించి చెప్పారు కానీ చిరంజీవి అంతటి వాడి ప్రక్కన నటించటానికి తను నో చెప్పలేదని తర్వాత రవితేజ బాధపడ్డారట. అంటే ఓ రకంగా కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. 


రవితేజను కాదనుకోవటంతో వెంటనే తనను ఎంతగానో అభిమానించే శ్రీకాంత్  ఆ పాత్రకు సెలెక్ట్ చెయ్యమని చెప్పడంతో రవితేజ స్థానే శ్రీకాంత్ ని పెట్టారు. చాలా మంది రవితేజాయే ఖాయం అవుతాడని చివరి దాకా అనుకున్నార్ట.  రవితేజ ఈ పరిణామం పట్ల నిరాశ చెందినట్లు చెప్పుకున్నారు.

అయితే  ఈ ఎంపిక మిస్ కాస్టింగ్ అనీ భారీ చిత్రాల్లో పాత్రల ఎంపిక సరిగా లేక పోతే ఎలా? అనీ రవితేజాయే ఆపాత్రకు సూటబుల్ అని కామెంట్స్ చేసిన వాళ్లంతా శ్రీకాంత్ కామెడీ టింజ్ ని , ఏటిఎం గా ఆ పాత్రను నిలబెట్టిన తీరుని తెగ మెచ్చుకున్నారు. 

read more: వెంకట్‌, సుశీలమ్మతో దెబ్బలు తిన్న నాగార్జున.. తండ్రి ఏఎన్నార్‌ లేకపోతే నాగార్జున చేసే పనులేంటో తెలుసా?

also read: 

Latest Videos

click me!