దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రాజమౌళి , మహేష్ బాబు సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. చాలా కాలంగాఆఫ్రికాలో జరుగుతున్న లాంగ్ షెడ్యూల్ కప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఇక రాజమౌళి నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి చేస్తున్న తదుపరి చిత్రమిది కావడం, అందులో మహేష్ బాబు హీరోగా నటిస్తుండటంతో సహజంగానే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గ్లోబ్ ట్రాటర్’ అనే ట్యాగ్ లైన్‌తో దూసుకుపోతున్న ఈసినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు.
25
కెన్యా షెడ్యుల్ కంప్లీట్
తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీకి సంబంధించిన కెన్యా షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. అక్కడ నిర్వహించిన షూటింగ్‌కు సంబంధించి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కర్ర పట్టుకుని కనిపించిన మహేష్ బాబు లుక్‌కి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ లుక్‌నే చూసి అభిమానులు “నెక్స్ట్ లెవల్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ పోస్టర్ వస్తే ఆ క్రేజ్ మరింత పెరగనుంది అని టాక్.
35
అడవుల్లో యాక్షన్ సీక్వెన్స్ లు
కెన్యా షెడ్యూల్‌లో అడవుల్లో భారీ ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తరువాత యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఈసినిమా కోసం ప్రత్యేకంగా సెట్లు వేసినట్టు సమాచారం. ఇక్కడ కూడా లాంగ్ షెడ్యుల్స్ ను కొనసాగించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడి భారీ సెట్‌లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సెట్ కాశీ క్షేత్రం నేపథ్యంలో ఉండే సన్నివేశాల కోసం వాడుతున్నారట.
ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. ఇందులో సినిమాలో ఉన్న ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు. ఫస్ట్ హాఫ్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత, సినిమా మొత్తం 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్టవుతుంది. అలాగే, నవంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేయనున్నట్టు రాజమౌళి టీమ్ నుంచి వినిపిస్తోన్న టాక్.
55
ఫ్యాన్స్ వెయిటింగ్
బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2026 చివరలో విడుదలయ్యే అవకాశముంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా టాలీవుడ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబుకు సబంధించి మేజర్ అప్ డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.