పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీపడి... బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఏంత? ఇంతకీ పోటీపడ్డ రెండు సినిమాలేంటి?
భాష ఏదైనా.. బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల మధ్య పోటీ కామన్ గా జరుగుతుంటుంది. టాలీవుడ్ లో కూడా పెద్ద పెద్దహీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యి.. గెలుపోటములు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సంక్రాంతికి కూడా ప్రభాస్, చిరంజీవి సంక్రాంతి బరిలో దిగబోతున్నసంగతి తెలిసిందే. అయితే వార్ లో ఎవరో ఒకరు గెలవాల్సిందే. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మధ్య కూడా ఇలాంటి బాక్సాఫీస్ వారే జరిగింది. ఈ వార్ లో పవన్ కళ్యాణ్ సినిమా భారీ కలెక్షన్లు సాధించగా.. మహేష్ బాబు సినిమా చావు దెబ్బ తిన్నది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డది ఎప్పుడో కాదు.. రీసెంట్ గానే.. ఇంతకీ ఆ సినిమాలేంటి?
25
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్...
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో ఎంతో మంది హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతుండగా.. వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు మాత్రమే అందరికంటే ఎక్కువగా రీరిలీజ్ అవుతూ.. ఎక్కువ స్పందనను అందుకుంటున్నాయి. ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, వీరిద్దరి క్లాసిక్ సినిమాల రీ రిలీజ్‌లకు మాత్రమే థియేటర్ల వద్ద ఎక్కువ స్పందన కనిపిస్తోంది. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు.
35
బాక్సాఫీస్ దగ్గర పవన్ - మహేష్ పోటీ..
ఈ క్రమంలో తాజాగా పవన్, మహేష్ రీరిలీజ్ సినిమాలు రెండు డిసెంబర్ 31న బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఒకే రోజు విడుదలైన రెండు క్లాసిక్ సినిమాలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మహేష్ బాబు కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘మురారి’ , పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా గుర్తింపు పొందిన ‘జల్సా’ చిత్రాలు 4K వెర్షన్స్ లో ఒకే రోజు రీ రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రీ రిలీజ్ పోటీలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. జల్సా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాం నుంచి సుమారు 50 లక్షల రూపాయల గ్రాస్ రాగా, సీడెడ్ , కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి మరో 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ మొత్తం వసూళ్లు కేవలం ఇండియా వ్యాప్తంగా వేసిన 180 షోస్ నుంచే రావడం విశేషం.ఈ స్థాయి వసూళ్లను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ముందుగా ఊహించి ఉండరు. అయితే ఈ సినిమా రీరిలీజ్ ఇది మొదటిసారి కాదు.. రెండో సారి. ఇక జల్సా మొత్తం రీ రిలీజ్ వసూళ్లు చూసుకుంటే.. మొదటి రీ రిలీజ్‌లో ఈ సినిమాకు 3 కోట్ల 23 లక్షల గ్రాస్ వచ్చింది. తాజా రెండవ రీ రిలీజ్‌లో వచ్చిన కోటి రూపాయలతో కలిపితే, మొత్తం గ్రాస్ 4 కోట్ల 23 లక్షల రూపాయలకు చేరింది.
55
సెకండ్ రీరిలీజ్ లో తేలిపోయిన మురారి..
మరోవైపు మురారి సినిమా విషయానికి వస్తే.. ఈసినిమా కూడా రెండో సారి రీరిలీజ్ చేశారు. ఈ రిలీజ్‌లో కేవలం 35 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లకే మహేష్ మూవీ పరిమితం అయ్యింది. ఎందుకంటే మురారి మొదటి రీ రిలీజ్‌లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాంటి చిత్రం రెండవసారి ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడంపై సూపర్ స్టార్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా న్యూ ఇయర్ రీ రిలీజ్ రేస్‌లో జల్సా సినిమా విన్నర్ గా నిలిచింది..మురారి సినిమాను పక్కకు నెట్టింది.