
అమూల్యను ట్రాప్ చేసింది తన అన్నయ్య అని తెలుసుకొని ప్రేమ గట్టిగానే తన పుట్టింటి వారికి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రామరాజు దగ్గరకు వచ్చి అంత పెద్ద గొడవ జరగడానికి తానే కారణమని, తన అన్నయ్య చెప్పిన మాటలు నమ్మి అలా మాట్లాడాల్సి వచ్చిందని చెబుతుందిప్రేమ. అలాగే రామరాజుని క్షమించమని కోరుతుంది. దానికి రామరాజు పర్వాలేదమ్మా అని అంటాడు. ఆ తర్వాత ప్రేమ వేదవతి దగ్గరికి వెళుతుంది. నన్ను క్షమించు అత్తా అని బతిమిలాడుతుంది. దాంతో వేదవతి కూడా ప్రేమగా కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది. అది చూసి వల్లికి తెగ బాధ, కోపం వచ్చేస్తుంది.
ఈ లోపు వల్లి మళ్లీ గొడవ పెట్టేందుకు సిద్ధం అయిపోతుంది. ‘నువ్వు భలే ఉన్నావు ప్రేమా... కత్తితో పొడిచేసి కట్టు కట్టేస్తే బయటికి వచ్చిన రక్తం, కడుపులో బాధ అంత సులువుగా పోతాయా? అట్లాగే మావయ్య గారిని మీ వాళ్లతో కూతురిని పెంచడం చేతకాదని అన్ని మాటలనిపించేసి.. ఇప్పుడు సింపుల్ గా సారీ అని చెప్పేస్తే మావయ్య గారికి కలిగిన అవమానం, బాధ తిరిగి వచ్చేస్తాయా?’ అంటూ చిచ్చుపెట్టేందుకు సిద్ధమైపోతుంది. ‘ఒకవేళ ఆరోజు మళ్లీ మామయ్య గారు చెబుతాను.. మీ వాళ్ళు మళ్లీ షర్టు చింపేసుకుంటే అది మావయ్య గారికి ఎంత అవమానం అని అగ్నికి ఆజ్యం పోస్తుంది.
‘నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఉన్నా.. ఆ ఇంటికి కూతురులాగే ప్రవర్తిస్తున్నావు.. మళ్లీ రేపటి రోజున నువ్వు ఇలాగే మీ వాళ్ళకి సపోర్ట్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి మావయ్య గారు చొక్కా చింపేయరని గ్యారెంటీ ఏంటి? నిన్ను మావయ్య గారు క్షమించారంటే మళ్ళీ మీ వాళ్ళ చేతిలో అవమానం పడడానికి ముహూర్తం పెట్టుకున్నట్టే’ అని రెచ్చగొడుతుంది వల్లీ.
ఈలోపు నర్మద వచ్చి అయితే ‘ఇప్పుడేమంటావ్.. ప్రేమను మామయ్య గారు క్షమించకూడదంటావా’ అని అడుగుతుంది. దానికి వల్లి ‘తేలిగ్గా క్షమించడానికి తను చేసిందేమైనా చిన్న తప్పా’ అని అంటుంది. దానికి నర్మద ‘అలాగైతే నిన్ను కూడా క్షమించకూడదు కదా అక్కా’ అంటుంది. దానికి వల్లి నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. దానికి నర్మద ‘ నువ్వు ఏ తప్పు చేయలేదా.. గుర్తు తెచ్చుకో, మనిషి అన్న తర్వాత ఏ తప్పు చేయకుండా ఎలా ఉంటారు? నువ్వు కూడా ఏదో ఒక రోజు తప్పు చేసే ఉంటావు. అందరికీ తెలిసి ఉండకపోవచ్చు.. బయట పడి ఉండకపోవచ్చు, కొన్నింటిని చూసి చూడనట్టు వదిలేయడం తప్పా గట్టిగా పట్టుకొని లాగితే చాలా ప్రమాదం అక్కా. ప్రేమ చిన్న పిల్ల. తెలిసో తెలియకో తప్పు చేసింది. మావయ్య గారు అర్థం చేసుకున్నారు. క్షమించేశారు. కొంతమంది మాత్రం తెలిసే తప్పు చేస్తుంటారు. మరి తాను తెలియక చేసిన తప్పును పట్టించుకోవాలా’ అని నర్మద అంటుంది. దీంతో వల్లి వెనక్కి తగ్గుతుంది.
వేదవతి కూడా ఆయనే క్షమించినప్పుడు.. ప్రేమను నేను క్షమించకుండా ఎలా ఉంటాను అని అంటుంది. రామరాజు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి, రేపు అమూల్యకు పెళ్లిచూపులు. అవి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ అని చెప్పి రామరాజు వెళ్లిపోతాడు. ఇక వేదవతి, నర్మద ప్రేమలను కౌగిలించుకొని ఆనందపడుతుంది. అది చూసి వల్లికి కడుపు మండిపోతూ ఉంటుంది.
ఇక్కడి నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. ప్రేమ.. ధీరజ్ దగ్గరకు వచ్చి సారీ చెబుతుంది. అత్తయ్య, మామయ్య క్షమించారు.. నువ్వు కూడా అర్థం చేసుకొని క్షమిస్తే నేను చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాను.. లేదంటే చూడడానికి కూడా గిల్టీగా ఫీల్ అవుతాను అని అంటుంది. ప్రేమ ఎంత బతిమిలాడినా ధీరజ్ మాత్రం పట్టించుకోడు. నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు చిరాగ్గా ఉంది అని అరుస్తాడు. ధీరజ్ నడిరోడ్డు మీద మా కుటుంబం అవమానపడడానికి, పరువు పోవడానికి కారణమయ్యావు.. నా గుండెల్లో ఎంత బాధ ఉంటుంది? అని ప్రశ్నిస్తాడు ధీరజ్. మా అన్నయ్య మాటలు విని మోసపోయాను అని ప్రేమ మళ్ళీ వివరిస్తుంది. అయినా సరే ధీరజ్ వెనక్కి తగ్గకుండా గొడవ పడతాడు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది, మర్యాదగా పక్కకి వెళ్ళు అంటాడు. నువ్వు వచ్చి పిలిచే వరకు బయట చలిలోనే ఉండిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రేమ.
రాత్రి అయ్యాక విశ్వ, అమూల్యను పిలిచి నీతో మాట్లాడాలని అంటాడు. ఇద్దరూ బయట కలుస్తారు. అమూల్య మాట్లాడుతూ ‘ఎందుకు రమ్మన్నావ్? నిన్ను చూస్తేనే చంపేయాలనిపిస్తుంది. నీ ప్రేమ నిజమని నమ్మాను. మన రెండు కుటుంబాలు కలవాలని నువ్వు సిన్సియర్గా అనుకుంటున్నావు అనుకున్నాను. అందుకే మొదటి నుంచి నువ్వంటే నాకు కోపం ఉన్నా.. నీ ప్రవర్తన, నాకు నచ్చకపోయినా సరే నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మీ చెల్లెల్ని మీ ఇంటికి తెచ్చుకోవడం కోసం నన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తావా? మాయమాటలతో మోసం చేస్తావా? ఇంకోసారి నీ మొఖం నాకు చూపించినా, మాట్లాడడానికి రమ్మని పిలిచినా మా అన్నయ్యలకు చెప్పి నీ అంతు చూస్తాను’ అంటుంది.
దానికి విశ్వ మాట్లాడుతూ మీ వాళ్ళలాగే నువ్వు నా ప్రేమని అనుమానించావు.. మీ వాళ్ళు చెప్పిన మాటలకి నీ స్థానంలో ఉన్న ఎవరైనా ఇలాగే నమ్ముతారు. ఇలాగే మాట్లాడతారు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా చెల్లి మా ఇంటికి ఎందుకు వస్తుంది? ఒకవేళ నిన్ను టార్చర్ పెడితే మీ అన్నయ్య మా చెల్లిని టార్చర్ పెట్టడా? అని మాయ మాటలతో అమూల్యను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తాడు. మీ వాళ్ళ మాటలు వినేముందు, నన్ను మోసగాడు అని నిందించే ముందు ఈ విషయాలన్నీ ఆలోచించాలి కదా అమూల్య అంటాడు. మళ్ళీ అమూల్య విశ్వ మాటలకు పడిపోతుంది. విశ్వ మాట్లాడుతూ ‘నేను నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాను. మన రెండు కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నాను. నీతో కలిసే బతికే అదృష్టం నాకు లేదనుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు’ అని చెప్పి వెళ్లిపోతాడు.
విశ్వ మాటలకు అమూల్య మళ్ళి ఆలోచనలో పడుతుంది ఇకనుంచి శీను ప్రేమ దగ్గరికి మారుతుంది బయట చలిలో ఉన్నా ప్రేమను చూసి బాధపడతాడు ఆమె కోసం బయట చలిమంట వేస్తాడు తర్వాత ప్రేమను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చూస్తాడు ఆమెకు దుప్పటి కప్పి స్టూల్ పై కూర్చోబెడతాడు ఇద్దరూ చలిమంట దగ్గరే కూర్చుంటారు ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది