
టాలీవుడ్ లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. స్టార్ హీరోలతో.. పాన్ ఇండియా లెవల్లో.. బ్లాక్ బస్టర్స్ ఇవ్వగలిగే వారు ఉన్నారు. కానీ అందరికంటే ముందు ఎక్కువ ఇమేజ్, స్టార్ డమ్, సంపాదన ఉన్న డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి పేరే ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు జక్కన్న. మన మార్కెట్ వెయ్యి కోట్లు దాటించి పరుగులు పెట్టించాడు. మన హీరోలకు 2000 కోట్ల మర్కెట్ ఉందని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన్ను చూసి ధైర్యం తెచ్చుకున్న సీనియర్ దర్శకులు ఎందరో ఉన్నారు. రాజమౌళి సినిమాలే కాదు.. ఆయన సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది.
రాజమౌళి బాహుబలి తరువాత చేసే ప్రతీ సినిమాకు బడ్జెట్ పెంచుతూ వస్తున్నాడు.. దానితో పాటు ఆయన రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉందట. ఆయన సినిమా నిర్మాణంలో షేర్ ను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని ఏరియా హక్కులు కూడా ఆయన తీసుకుంటాడటని టాక్. అయితే జక్కన్నకు ఒక్క సినిమాకు దాదాపు 250 కోట్ల వరకూ అందుతాయని తెలుస్తోంది. ఈ లెక్కన్న ఇండియాలోనే ఒక సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే దర్శకుడిగా రాజమౌళి నిలిచారని చెప్పవచ్చు. అయితే రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న మరో టాలీవుడ్ డైరెక్టర్ గురించి మీకు తెలుసా?
రైటర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. రైటర్ల ఇమేజ్ ను అమాంతం పెంచిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితలు డైరెక్టర్లుగా మారితే ఇలా ఉంటుంది అని.. అద్భుతమైన సినిమాలతో త్రివిక్రమ్ నిరూపించాడు. త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తరువాత కూడా రైటర్ గా తన సినిమాలకు మాత్రమే కాకుండా, ఇతర సినిమాలకు కూడా పనిచేస్తున్నాడు. అంతే కాదు సితార బ్యానర్ లో త్రివిక్రమ్ భాగస్వామిగా ఉన్నారు, ఈ బ్యానర్ లో సినిమాల పని అంతా త్రివిక్రమే చూసుకుంటాడట, ఇక సినిమా ఫైనల్ కాపీని జడ్జ్ చేసినందుకు అతనికి సపరేట్ అమౌంట్ ని ఉంటుందని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ కోసం కథలను వింటూ ఆ కథల మీద వర్క్ చేసినందుకు అటువైపు నుంచి కూడా అతనికి డబ్బులు వస్తున్నాయని తెలుస్తోంది. ఇలా ఎటు చూసుకున్నా.. త్రివిక్రమ్ ఏడాదికి 150 కోట్ల వరకూ సంపాదిస్తున్నారని టాక్.
రాజమౌళి 250 కోట్లు సంపాదిస్తున్నారు అనుకుంటే... ఆయన సినిమా నాలుగైదేళ్లకొక్కసారి వస్తుంది. సినిమా సినిమాకు గ్యాప్ ఉంటుంది. కానీ త్రివిక్రమ్ పరిస్థితి అది కాదు కదా..? సినిమా లేకున్నా.. ఆయన రైటర్ గా బిజీగానే ఉంటారు. నిర్మాతగా, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇతర మార్గాల్లో ఆయన సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈలెక్కన్న రాజమౌళి కంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సంపాదన చాలా ఎక్కువ అంటున్నారు సినీ జనాలు. ఇవి అఫీషియల్ లెక్కలు మాత్రం కాదు.. టాలీవుడ్ సర్కిల్ లో వైరల్ అవుతున్న విషయాలు.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా బిజీలో ఉన్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. పాన్ వరల్డ్ మూవీని గట్టిగా ప్లాన్ చేశాడు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న వారణాసిలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న టీమ్. ఈ ఏడాది సమ్మర్ వరకూ..మహేష్ బాబు షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుందని సమాచారం.
గుంటూరు కారం సినిమా తరువాత చాలా కాలంగా మరో సినిమా డైరెక్ట్ చేయలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్. రైటర్ గా కొన్నిసినిమాలకు ఆయన వర్క్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో మాటల మాత్రికుడి సినిమాలు ఉంటాయి అని ప్రచారం జరిగింది. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈసినిమా తరువాత ఆయన పవన్ కళ్యాణ్ తో కూడా మూవీ చేస్తారన్న టాక్ ఉంది.