ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు మహేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా చేసినా.. అన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నాడు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం నమ్రత ఎంత చెప్పినా వినకుండా.. భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడట మహేష్. ఇంతకీ ఏంటా సినిమా?
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి... తండ్రిని మంచిన తనయుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొద్ది కాలంలోనే ఆయన స్టార్ హీరో హోదాను సాధించాడు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వెళ్తున్న సూర్ స్టార్.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగుటు వేస్తున్నాడు మహేష్. తనతో కలిసి వంశీ సినిమాలో హీరోయన్ గా నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్.. భార్యతో చర్చించిన తరువాతే ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.
25
మహేష్ సినిమా సెలక్షన్స్ లో నమ్రత పాత్ర
పెళ్లి తరువాత మహేష్ బాబు సినిమాల ఎంపికల విషయంలో నమ్రత కీలక పాత్ర పోషిస్తు వస్తున్నారు. ముఖ్యంగా ఏ కథను ఎంచుకోవాలి, ఏ సినిమాను చేయాలి అనే విషయాల్లో నమ్రత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోందని సమాచారం. మహేష్ కెరీర్ లో మార్పుకు కూడా ఆమె కారణం అని అంటున్నారు. మహేష్ దగ్గరకు వచ్చే కథలను ముందుగా నమ్రత విని, ఆమెకు ఓకే అనిపిస్తే.. అది మహేష్ బాబు దగ్గరకు వెళ్తుంది. ఆ కథ నచ్చితే సూపర్ స్టార్ తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం ఉంది. ఇలాగే జాగ్రత్తగా సినిమాలు చేసి.. బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మహేష్. కానీ ఒక సారి మాత్రం నమ్రత వద్దన్నా వినకుండా నటించి నష్టపోయాడట మహేష్.
35
నమ్రత మాట వినకుండా నష్టపోయిన మహేష్..?
ఈ క్రమంలో మహేష్ బాబు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా ప్రతీ తెలుగువారి మనసుల్లో అలా నిలిచిపోయింది. మహేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ , తో పాటు యూత్ లో కూడా ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. దాంతో మహేష్ బాబు ఇంకే ఆలోచించకుండా.. ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మరో అవకాశం ఇచ్చాడు. కథను కూడా పట్టించుకోకుండా.. డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమాకు ఓకే చేశాడట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాను చేశాడు మహేష్. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా చేయడం నమ్రతకు ఇష్టం లేదట. ఈ సరిగ్గాలేదని.. మహేష్ బాబుకు చాలా చెప్పి చూసిందట కానీ మహేష్ వినలేదని సమాచారం.
బ్రహ్మోత్సవం’ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితంతో మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు.‘బ్రహ్మోత్సవం’ అనుభవం తర్వాత మహేష్ బాబు సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్స్ తో పాటు ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉండే సమయంలో కథలను పూర్తిగా విని, నిర్ణయం తీసుకోవడానికి మహేష్ కు టైమ్ ఉండటంలేదు. అందుకే ఆ బాధ్యతలను నమ్రత తీసుకున్నారట. దాంతో మహేష్ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోది. . నమ్రత కథను విన్న తర్వాత, ఆపై మహేష్ బాబు తుది నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.
55
వారణాసి బిజీలో సూపర్ స్టార్
ప్రస్తుతం మహేష్ బాబు వరల్డ్ క్లాస్ డైరెక్టర్ రాజమౌళితో ‘వారణాసి’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్తాయిలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ఈసినిమాపై ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 2027 సమ్మర్ లో ఈసినిమా