ఇండస్ట్రీతో పాటు.. సినిమాల విషయంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా హిట్ అయ్యిందా లేదా అనేది ఒకప్పుడు రోజులను బట్టి నిర్ణయించేవారు. ఒక సినిమా వంద రోజులు ఆడితే.. అది హిట్ అనేవారు.. 200 రోజులు ఆడితే బ్లక్ బస్టర్ అనేవారు. 100 రోజులు వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వారం రెండు వారాలకే ఎంత పెద్ద సినిమా అయితే తీసి పక్కన పెడుతున్నారు. కలెక్షన్లు ఎన్ని వందల కోట్లు వచ్చాయి అనేదే చూసుకుంటున్నారు.
వైవా హర్ష తన భార్యకు విడాకులు ఇస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్..?
Mahesh Babu
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక సినిమా 200 రోజులు ఆడిందంటే ఎవరైనా నమ్ముతారా..? కాని ఇది నిజం అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సబంధించిన ప్లాప్ మూవీ ఇన్ని రోజులు ఆడిందంటే అందరు షాక్ అవుతున్నారు. బ్లక్ బస్టర్ అయిన సినిమాలే అలా ఆడటం లేదు. ప్లాప్ మూవీ ఎలా ఇలా అని అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..?
ఆలియా భట్ ఇతర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ ఏంటంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఈ రికార్డ్ ను సాధించింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా.. ఆ తరువాత కూడా అదే టాక్ ను కంటీన్యూ చేసింది. హారిక అంట హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల మహేష్ కు జంటగా నటించి మెప్పించింది. థమన్ సంగీతం సమకూర్చిన ఈసినిమాను మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న రిలీజ్ అయిన గుంటూరు కారం.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
పాప కోసం ప్రాణాలకు తెగించిన సల్మాన్ ఖాన్... రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ స్టార్..
మహేష్ బాబు ను కాస్త డిఫరెంట్ గా చూపించడం.. శ్రీలీల చేత ఇంకో రెండు స్టెప్పుటు ఎక్కువగా వేయించడం తప్పించి.. ఈసినిమాలోకొత్తగా ఆడియన్స్ కు ఏం కనిపించలేదు. దాంతో త్రివిక్రమ్ పైగట్టిగా ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వడం.. మహేష్ బాబు క్రేజ్ తోడవ్వడంతో.. కమర్షియల్ గా ఈసినిమా కాస్త రాబట్టగలవిగింది. బాక్సాఫీస్ దగ్గర 172 కోట్ల గ్రాన్ సు కలెక్ట్ చేసింది సినిమా. అటు ఓటీటీలోను.. ఇటు టెలివిజన్ లో కూడా మంచి స్పందన రాబట్టగలిటింది.
అయితే ఈ సినిమా ఖాతలో మరో రికార్డ్ కూడా జమఅయ్యింది అదేంటంటే.. 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన గుంటూరు కారం.. రీసెంట్ గా ఒక్క కేంద్రంలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో ఉన్న చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్ లో 200 రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది గుంటూరు కారం సినిమా. రోజుకి 4 ఆటలతో ఇన్ని రోజులు ప్రదర్శింపబడి సరికొత్త రికార్డ్ నుసెట్ చేసింది.