Mahesh Babu Goes Shirtless in Varanasi వారణాసి సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నారు. కృష్ణ చివరికోరిక తీర్చడం కోసమే.. ఆరడుగుల అందగాడు రాముడి పాత్రలో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడా? గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ ఏమన్నాడు.
తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చాలా తక్కువ టైమ్ మాట్లాడినా.. చాలా విలువైన మాటలు వదిలారు సూపర్ స్టార్. ఈసినిమాలో ఆయన శ్రీరాముడిగా కొద్దిసేపు కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి రివిల్ చేయగా.. ఆ విషయాన్నికి సబంధించిన బ్యాక్ గ్రౌండ్ ప్లాష్ బ్యాక్ ను మహేష్ బాబు వెల్లడించారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. '' నాకు నాన్నగారు అంటే ఎంత ఇష్టంమో మీ అందరికి తెలుసు. ఆయన ప్రతీ మాట నేను వింటాను.. కానీ ఒక్క మాట మాత్రం ఎప్పుడూ వినలేదు.. నన్ను ఎప్పుడూ ఒక్క సారి పౌరాణిక పాత్ర చేయమని అడిగారు. నీ కలర్, హైట్, పర్సనాలిటీకి ఆ పాత్ర సూట్ అవుతుంది అన్నారు. కానీ ఆయన ఉన్నప్పుడు మాట నేను వినలేదు.. ఇప్పుడు ఆయన నా మాట వింటూనే ఉంటారు'' అని అన్నారు. ఈరకంగా ఫస్ట్ టైమ్ మహేష్ బాబును రాముడిగా ఫ్యాన్స్ వెండితెరపై చూడబోతున్నారు.
24
షర్ట్ విప్పబోతున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో చాలా డిఫరెంట్ గా జరిగింది. అక్కడ ఉన్న ఓ ర్యాంప్ పై.. టీజర్ లో వచ్చినట్టుగా ఎద్దుపై కూర్చొని, త్రిశూలం పట్టుకుని మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఈ విజ్యువల్ చూసి ..ఫ్యాన్స్ దిల్ కుష్ అయిపోయారు. ఇక ఈ ఎంట్రీ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. '' చాలారోజులు అయ్యింది బయటకు వచ్చి.. చాలా కొత్తగా అనిపిస్తోంది. స్టేజ్ మీదకు మామూలుగా నడిచోస్తాను అన్నాను.. రాజమౌళి కుదరదు అన్నారు. సింపుల్ గా బులుగు చొక్క వేసుకుని వస్తాను అన్నాను...కుదరదు అన్నారు. చూశారుగా ఎలా సెట్ చేశారో.. అదేంటండి షర్ట్ కు గుండీలు లేవు.. రెండు మూడు బటన్స్ ఇవ్వండి అన్నాను.. కుదరదమ్మ.. అదే స్టైలు అన్నారు. నెక్ట్స్ చొక్కా లేకుండా రమ్మటారేమో.. చూస్తుంటే అదే జరగబోతున్నట్టు అర్ధం అవుతోంది " అని అన్నారు మహేష్. సూపర్ స్టార్ మాటలను బట్టి అర్ధం అవుతోంది.. ఈసినిమాలో ఫస్ట్ టైమ్ మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించబోతున్నట్టు. రాముడి పాత్రలో కనిపిస్తారు కాబట్టి.. అప్పుడు షర్ట్ లేకుండా మహేష్ కనిపించే అవకాశం ఉంది. మరి ఈ సీన్ కోసం సీక్స్ ప్యాక్ చేశాడో లేదో మహేష్.. అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
34
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది..
మహేష్ బాబు మాట్లాడుతూ.. '' అప్ డేట్ అప్ డేట్ అన్నారు కదా.. ఎలా ఉంది... నా డైలాగ్ లోనే చెపుతాను.. డిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది కదా.. . నాక్కూడా అలానే ఉంది. ఈ అప్ డేట్ చూస్తుంటే.. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నందుకు.. ఇది టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రమే.. ముందు ముందు ఎలా ఉండబోతోందో.. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంతకు మంచి అద్భుతాలు ముందు ముందు ఉంటాయి. ఇక మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరకుకుంటున్నాను.. చాలా దూరం నుంచి నా కోసం వచ్చారు.. మీకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు.. ఇంతకంటే ఏం చేయగలను.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప.. మేము.. మా టీమ్ పోలీస్ డిపార్టెమెంట్ హెల్ప్ తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం.. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి ప్లీజ్'' అని ఫ్యాన్స్ కు విన్నవించి తన స్పీచ్ ను ముగించారు మహేష్ బాబు.
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఎవరు నోరు జారకుండా రాజమైళి చాలా జాగ్రత్త పడ్డారు. మహేష్ బాబుతో సహా.. అందరు చాలా మితంగా మాట్లాడారు. ఎక్కడా ఏ విషయం బాయటకు చెప్పలేదు. కొన్ని విషయాలు వాళ్లు చెప్పాలి అనుకున్నవి తప్పించి.. ఏవిషయం బయటకు రాలేదు. కీరవాణి మాత్రం రిలీజ్ 2027 సమ్మర్ లో ఉంటుందని కాస్త నోరు జారాడు. రాజమౌళి మాత్రం రామాయణంలో ఓ ఘట్టం ఈసినిమాలో ఉంటుందని, రాముడిగా మహేష్ కనిపిస్తారని చెప్పారు. ఇక మహేష్ బాబు మాత్రం తన పాత్ర గురించి కొద్దిగా హింట్ ఇచ్చాడు అంటే. అసలు సినిమా ముందు ఉందని మహేష్ బాబు వెల్లడించారు. మొత్తానికి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ద్వారా.. మహేష్ బాబు ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యే అప్ డేట్స్ వారికి లభించాయి. సినిమా గురించి మరిన్ని వివరాలు ముందు ముందు జరగబోయే ఈవెంట్స్ లో చెపుతామని హింట్ ఇచ్చారు టీమ్. ఇంకా ఏడాది పాటు షూటింగ్ కొనసాగబోతున్నట్టు కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు.