రాముడిగా మహేష్‌ బాబు, రామాయణంలోని అదిరిపోయే ఘట్టంతో `వారణాసి`.. ట్రైలర్‌ అద్భుతం

Published : Nov 15, 2025, 10:16 PM IST

మహేష్‌ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న `వారణాసి` ట్రైలర్‌ని విడుదల చేశారు. విజువల్‌ వండర్‌ మాత్రమే కాదు, అద్భుతం అని చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచ సినిమా షేక్‌ అయ్యేలా ఈ ట్రైలర్ ఉండటం విశేషం. 

PREV
14
వారణాసి మూవీ ట్రైలర్‌

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి `వారణాసి` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ని ఈ శనివారం సాయంత్రం ఈవెంట్‌లో విడుదల చేశారు. అయితే ఇందులో ట్రైలర్‌ని విడుదల చేయాలని భావించారు. సినిమా కథేంటో చెప్పే వీడియోని భారీగా ప్లాన్‌ చేశారు. దాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. ఈవెంట్‌లో అభిమానులకు ఈ వీడియోని ప్రదర్శించాలని భావించారు. కానీ టెక్నీకల్‌గా సమస్యలు వచ్చాయి. దానికి పవర్‌ సరిపోవడం లేదని, దీంతో చేయడం కష్టమని రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా ఎట్టకేలకు ట్రైలర్‌ని విడుదల చేశారు.

24
టైమ్‌ ట్రావెల్‌గా వారణాసి

ఇందులో సినిమా కథేంటో చూపించారు.  టైమ్ ట్రావెల్‌ కథతో రూపొందించినట్టు ట్రైలర్‌లో కనిపించింది. ఈ సినిమా వారణాసిలో 512సీఈ కాలం నుంచి ప్రారంభమైంది. అందులోని ఒక అగ్ని కణం ప్రయాణిస్తూ 2027 సీఈ ఆస్ట్రరాయిడ్‌ సంభవికి చేరుకుంటుంది. అది ఐస్‌ కణంగా మారి ఆంటార్కిటికా సముద్రంలో పడింది. అందులోనుంచి ఆఫ్రికన్‌ అడవులకు, అక్కడి నుంచి ఉగ్రబట్టి కేవ్‌లోకి, అక్కడి నుంచి 7200 ఈబీసీ కాలంలోని త్రేతాయుగంలోని లంకానగరానికి చేరుకుంది. అక్కడ హనుమంతుడి విశ్వరూపం చూపించారు. లంకా దహనం చూపించారు. అక్కడి నుంచి వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌కి చేరుకుంది.

34
వారణాసి ట్రైలర్‌ అద్భుతం

అందులో నుంచి ఒక పవర్‌తో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై సవారీ చేస్తూ మహేష్‌ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఆయన లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. ఈ సందర్భంగా వారణాసి టైటిల్ రివీల్‌ అయ్యింది. మొత్తంగా ఈ ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. విజువల్స్ ఊహకందని విధంగా ఉంది. అద్భుతం అని చెబితే అతిశయోక్తి కాదు. ఏ హాలీవుడ్‌ చిత్రాలు కూడా దీనికింద పనికి రావని చెప్పొచ్చు. మొత్తంగా మూడు నాలుగు టైమ్‌ ట్రావెల్స్ లోకి వెళ్లి వచ్చే కథగా, హనుమంతుడి జర్నీగా ఆవిష్కరించినట్టుగా ఉంది. అదే సమయంలో రాజమౌళి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు. రామాయణంలోని లంకా దహణం ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందించినట్టు తెలిపారు.

44
రాముడిగా మహేష్‌ బాబు

ఇందులో మహేష్‌ బాబు పాత్రని తెలియజేశారు రాజమౌళి. పాత్ర పేరు రుద్ర అయినా, ఆయన రాముడిగా కనిపిస్తారని తెలిపారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నట్టు ఆయనే చెప్పారు. ఎప్పుడూ చూడని మూవీని మనకు చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ అన్ని కాలాలకు మహేష్‌ జర్నీ చేస్తారు. ఆయన సంచారీగా కనిపిస్తారని, అదే ఈ మూవీ అని తెలుస్తోంది. సినిమాని ఒక ఎపిక్‌గా రూపొందిస్తున్నట్టు తెలిపారు జక్కన్న. ఈ రామాయణం ఎపిసోడ్‌ని 60 రోజులు షూట్‌ చేశారట. ఈ పార్ట్ షూటింగ్‌ అయిపోయిందని, మహేష్‌కి రాముడి గెటప్‌ వేస్తే అదిరిపోయిందన్నారు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఆ ఎపిసోడ్‌ సాగిందన్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లోనూ ఆ షాట్‌ చూపించి వదిలేశారు. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. దీంతో ఇది ఫ్యాన్స్ కి, కామన్‌ ఆడియెన్స్ విజువల్‌ ట్రీట్‌లా ఉండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories