Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే

Published : Oct 08, 2026, 08:00 AM IST

Nana Patekar Passed away: ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్‌ కన్నుమూశారు. ఆయన గోవాలో గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్‌లో తనదైన నటనతో విశ్వరూపం చూపించిన ఆయన మరణం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమకి తీరని లోటు.

PREV
13
విలక్షణ నటుడు నానా పటేకర్‌ కన్నుమూత

బాలీవుడ్, మరాఠీ చిత్రసీమల్లో తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లోనే కాదు, యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమకి విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు.

23
నానా పటేకర్‌ నేపథ్యం, మొదటి సినిమా వివరాలు

విశ్వనాథ్ దినకర్ పటేకర్ అసలు పేరు. 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్‌లో జన్మించారు. ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన తొలుత రంగస్థల నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టారు.

1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో నానా పటేకర్ సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ తన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1988లో వచ్చిన ‘సలామ్ బాంబే!’ ఆయనకు మంచి గుర్తింపు తీసుకురాగా, 1989లో వచ్చిన ‘పరిందా’ ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాలో ‘అన్నా’ పాత్రకు జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.

33
నానా పటేకర్‌ లైఫ్‌ని మార్చేసిన సినిమాలు

ఆ తర్వాత ‘క్రాంతివీర్’, ‘అగ్ని సాక్షి’, ‘ఖామోషీ: ది మ్యూజికల్’, ‘తిరంగా’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’ వంటి ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ‘క్రాంతివీర్’లో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రంతో తన ప్రతిభను చాటుకున్నారు.

నానా పటేకర్ తన కెరీర్‌లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన నానా పటేకర్.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రలో కనిపించినా తనదైన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ విలక్షణ నటుడి శకం ముగిసినట్టైంది

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories