మహేష్‌ చేస్తానన్నా, నేను చేయను.. పూరీ జగన్నాథ్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. సూపర్‌స్టార్‌తో గొడవకి కారణమిదే

Published : Sep 28, 2025, 11:47 AM IST

మహేష్‌ బాబుకి, పూరీ జగన్నాథ్‌కి మధ్య గొడవేంటి? మహేష్‌ బాబు సినిమా చేస్తానన్నా, తాను చేయను అని పూరీ జగన్నాథ్‌ ఎందుకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారో తెలుసుకుందాం. 

PREV
15
మహేష్ బాబుకి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన పూరీ జగన్నాథ్‌

మహేష్‌ బాబు, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌ కి మంచి క్రేజ్‌ ఉంది. మహేష్‌కి రెండు బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చారు పూరీ జగన్నాథ్‌. ఇంకా చెప్పాలంటే `పోకిరి`తో ఇండస్ట్రీ హిట్‌ని అందించారు. ఈ మూవీ అప్పటి వరకు ఉన్న టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. టాలీవుడ్‌లో కలెక్షన్ల గోల, ఆ పోటీ స్టార్ట్ అయ్యింది ఈ మూవీతోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీని ఈ సినిమా చాలా రకాలుగా ప్రభావితం చేసింది. `పోకిరి`లోని క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఇప్పుడు చూసినా అది గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో `బిజినెస్‌మేన్‌` వచ్చింది. `పోకిరి` అంత హిట్‌ కాకపోయినా బాగానే ఆడింది. కమర్షియల్‌గా సత్తా చాటింది.

25
మహేష్‌తో పూరీ చేయాల్సిన `జనగణమన` ఆగిపోయింది

ఆ తర్వాత మహేష్‌ బాబుతో పూరీ జగన్నాథ్‌ `జనగణమన` అనే మూవీ చేయాలనుకున్నారు. ఆల్మోస్ట్ ప్రకటన వరకు వచ్చింది. కానీ అనూహ్యంగా ఆగిపోయింది. కథలో మార్పులు జరిగాయి. అదిగో, ఇదిగో అన్నారు. కానీ చివరికి వర్కౌట్‌ కాలేదు. అదే కథతో, అదే టైటిల్‌తో విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాలనుకున్నారు పూరీ. `లైగర్‌` తర్వాత వెంటనే ఈ సినిమాని ప్రారంభించాలనుకున్నారు. ఈ మూవీ ఓపెనింగ్‌ కూడా జరిగింది. ఆర్మీ నేపథ్యంలో ఉన్న కథ కావడంతో ఆర్మీ అధికారులను కూడా కలిశారు. చాలా హడావుడి జరిగింది. కానీ `లైగర్‌` ఫ్లాప్‌ కావడంతో ఈ మూవీ పక్కకెళ్లింది. ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్‌ చేశారు. ఆ తర్వాత `డబుల్‌ ఇస్మార్ట్` చేశాడు పూరీ. అది కూడా వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు తమిళ హీరో విజయ్‌ సేతుపతితో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌, టీజర్‌ని నేడు ఆదివారం(సెప్టెంబర్‌ 28న)న ప్రకటించాలని భావించారు. నేడు పూరి పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌, టీజర్‌ని విడుదల చేయాలని భావించారు. కానీ తమిళనాడులో తళపతి విజయ్‌ ర్యాలీలో నెలకొన్న తొక్కిసలాట ఘటనలో దాదాపు 36 మంది కన్నుమూశారు. దీంతో ఈ ఘోర ఘటనని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ అప్‌ డేట్‌ని వాయిదా వేశారు.

35
సక్సెస్‌లో ఉన్న దర్శకులతోనే మహేష్‌ సినిమాలు చేస్తారు

ఇదిలా ఉంటే మహేష్‌బాబుతో `జనగణమన` సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పూరీ జగన్నాథ్‌ వెల్లడించారు. ఆయన రామ్‌ తో చేసిన `ఇస్మార్ట్ శంకర్‌` సినిమా సమయంలో 99 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌తో సినిమాకి సంబంధించి స్పందించారు. మహేష్‌ బాబు సక్సెస్‌లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తారని, అందుకే తనతో సినిమాలు చేయడం లేదని తెలిపారు. మహేష్‌ బాబు ఫ్యాన్స్ తనని బాగా లైక్‌ చేస్తారని, ఇప్పటికీ టచ్‌లోనే ఉంటారని, అన్నా మహేష్‌తో సినిమా చేయాలని అడుగుతుంటారని, జనగణమన సినిమా చేయమని వాళ్లు చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తుంటారని, తనపై ఎంతో ప్రేమని చూపిస్తుంటారని వెల్లడించారు. అందుకే మహేష్‌ బాబు కంటే ఆయన ఫ్యాన్స్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పారు.

45
కొంప ముంచిన పూరీ జగన్నాథ్‌ నోటి దురుసు

ఈ సందర్భంగా మరో షాకిచ్చే విషయాన్ని వెల్లడించారు పూరీ జగన్నాథ్‌. `ఇస్మార్ట్ శంకర్‌` హిట్‌ అయిన తర్వాత మహేష్‌బాబు సినిమా చేద్దామంటే మీరు చేయడానికి రెడీనా అని యాంకర్‌ అడగ్గా, `నేను చేయను` అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు పూరీ జగన్నాథ్‌. ఆయన చేస్తానన్నా నేను చేయను, పూరీకంటూ ఒక యాటిట్యూడ్‌ ఉంటుంది కదా అని ఆయన వెల్లడించడం విశేషం. బాహుశా ఇలాంటి స్టేట్‌మెంట్స్ కారణంగానే మహేష్‌ తో మళ్లీ పూరీ సినిమా చేయలేకపోయారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. `పూరీ అన్న గ్రేట్‌. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండి దానికి కట్టుబడి ఉండాలనుకోవడం చాలా గొప్ప సాహసం. అందులో ఒక పెద్ద హీరో పేరు వొత్తి చెప్పడం` అని, `మహార్షి` ఈవెంట్‌లో మహేష్‌ బాబు అందరి డైరెక్టర్స్ పేరు చెప్పారు, కానీ పూరీ పేరుని స్కిప్ చేశారు. దీన్ని బట్టి చూస్తే, పూరీ చేసిన ఈ వ్యాఖ్యలే ఆ గొడవకి కారణమని అంటున్నారు నెటిజన్లు.

55
మహేష్‌ తో పూరీ గొడవకు కారణం అదే

ఓ ఇంటర్వ్యూలో మహేష్‌ బాబుకి ఇదే ప్రశ్న ఎదురయ్యింది. పూరీ జగన్నాథ్‌తో సినిమా మళ్లీ ఎందుకు చేయలేదని యాంకర్‌ ప్రశ్నించగా, నెంబర్‌ ఇస్తాను, ఎందుకు చేయలేదో ఆయన్నే అడగండి అంటూ సెటైర్లు వేశారు మహేష్‌. పూరీ విషయంలో ఆయన గట్టిగానే హర్ట్ అయినట్టు దీని బట్టి తెలుస్తోంది. మహేష్‌, పూరీల మధ్య గొడవకి పూరీ బోల్డ్ స్టేట్‌మెంటే కారణమని అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈగోల ప్రభావం చాలా ఉంటుంది. వాటి వల్లే చాలా సినిమాలు ఆగిపోయాయి. పూరీ, మహేష్‌ ల విషయంలోనూ అదే జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌.. రాజమౌళితో మూవీ చేస్తున్నారు. దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ హిట్‌ అయితే మహేష్‌ రేంజ్‌ మారిపోతుంది. గ్లోబల్‌ స్టార్‌ అయిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories