`కాంతార 2` రిలీజ్‌ డేట్‌ వచ్చింది.. ఏకంగా బాలయ్య, పవన్‌లతో పోటీ, ఈ దసరాకి రచ్చ వేరే లెవల్‌

Published : Jul 07, 2025, 12:12 PM IST

కన్నడ మూవీ `కాంతార 2` రిలీజ్‌ డేట్‌ వచ్చింది. రిషబ్‌ శెట్టి బర్త్ డే సందర్భంగా విడుదల తేదీని ఇచ్చారు. కానీ తెలుగులో దీనికి గట్టి పోటీ నెలకొంది. 

PREV
15
`కాంతారః ఛాప్టర్‌ 1` రిలీజ్‌ డేట్‌

కన్నడ సంచలనం `కాంతార` మూవీ మూడేళ్ల క్రితం వచ్చి ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విశేషంగా ఆకట్టుకుంది. 

ఈ మూవీ నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం. దీంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు రిషబ్‌ శెట్టి. ఆయనే హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో `కాంతార` చిత్రాన్ని రూపొందించారు. 

ఇప్పుడు ఈ మూవీకి రెండో పార్ట్ వస్తోంది. ప్రీక్వెల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. `కాంతారః లెజెండ్ ఛాప్టర్‌ 1` పేరుతో దీన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది.

25
గాంధీ జయంతి కానుకగా `కాంతార 2`

`కాంతార 2ః లెజెండ్‌ ఛాప్టర్‌ 1` రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది నిర్మాత సంస్థ హోంబలే ఫిల్మ్స్. నేడు సోమవారం(జులై 7) రిషబ్‌ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. 

ఈ ఏడాది అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా సినిమాని రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో యుద్ధ రంగంలో వీరంగం చేస్తున్న రిషబ్‌ శెట్టి లుక్‌ అదిరిపోయింది. 

ఆయన అరుస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నట్టుగా ఈ లుక్‌ ఉంది. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది.

35
`కాంతార`కి ప్రీక్వెల్‌గా `కాంతారః ఛాప్టర్‌ 1`

ఈ `కాంతార 2`లో హీరోకి సంబంధించిన గతాన్ని చూపించబోతున్నారు. ఆయన మూలాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? గతంలో ఏం జరిగింది? దాని కథేంటి? అనేది వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

 ఇతిహాసాలు ఎక్కడ పుడతాయో అక్కడ అడవి గర్జన ప్రతిధ్వనిస్తుంది అంటూ నిర్మాణ సంస్థ పంచుకున్న కొటేషన్‌ అదిరిపోయింది. మొదటిది పెద్ద విజయం సాధించడంతో ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. 

కానీ ఈ చిత్రం భారీ పోటీ నడుమ విడుదల కావడమే ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులో దీనికి గట్టి పోటీ నెలకొందని చెప్పొచ్చు. రెండు భారీ సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది.

45
వారం ముందుగానే పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` రిలీజ్‌

`కాంతార 2` విడుదలకు వారం ముందే రెండు భారీ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఓజీ` మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతుంది. 

సుజీత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇమ్రాన్‌ హష్మి, ప్రియాంక మోహన్‌, అర్జున్‌ దాస్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముంబయి బ్యాక్‌ డ్రాప్‌లో సాగే గ్యాంగస్టర్‌ మూవీ ఇది. టీజర్‌ ఇప్పటికే విడుదలై సినిమాపై హైప్‌ పెంచింది.

 ఇప్పటికీ అదే హైప్‌ కంటిన్యూ అవుతుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 25న రిలీజ్‌ కాబోతుంది. దీనికోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

55
`కాంతార 2`కి `అఖండ 2` దెబ్బ

దీంతోపాటు సెప్టెంబర్‌ 25నే బాలకృష్ణ నటిస్తున్న `అఖండ 2` విడుదల కాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బాలయ్య నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. 

దీన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. శివతత్వం ఆధారంగా చేసుకుని బోయపాటి ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్స్ పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. 

బాలయ్య కూతురు తేజస్విని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా సెప్టెంబర్‌ 25న రెండు భారీ తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటి ప్రభావం రెండు వారాలు ఉంటుంది.

 దీంతో `కాంతార 2`కిది పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. కానీ ఈ దసరాకి సినిమా పండగతోపాటు, బాక్సాఫీసు రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories