98 కిలోల స్టార్ హీరో..తక్కువ టైమ్ లో 18 కిలోల బరువు ఎలా తగ్గాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఆమిర్ ఖాన్

Published : Jan 17, 2026, 07:23 PM IST

 ఒక సినిమా కోసం దాదాపు 98 కేజీల బరువు పెరిగాడు స్టార్ హీరో  ఆమిర్ ఖాన్.  చాలా తక్కువ టైమ్ లో ఆయన 18 కేజీల బరువు ఎలా తగ్గాడో తెలుసా? ఇలా బరువు తగ్గడానికి ఆమిర్ వాడిన ట్రిక్ ఏంటి? 

PREV
15
ఆమిర్ ఖాన్ 18 కిలోల బరువు ఎలాతగ్గాడు?

ఆమిర్ ఖాన్ తన శారీరక మార్పుతో మరోసారి వార్తల్లో నిలిచారు. కఠినమైన వర్కౌట్స్ కాకుండా, ప్రత్యేక యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్‌తో 18 కిలోలు తగ్గినట్లు ఆయన చెప్పారు.

25
ఆరోగ్య కారణాల కోసం

ఈ బరువు తగ్గడం "యాదృచ్ఛికంగా" జరిగిందని ఆయన అన్నారు. ఆరోగ్య కారణాల కోసం మొదలుపెట్టిన ఈ డైట్, తనకు అద్భుతంగా పనిచేసిందని ఆమిర్ ఖాన్ చెప్పారు.బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆరోగ్య కారణాల వల్ల పాటిస్తున్న కొత్త డైట్ మ్యాజిక్‌లా పనిచేస్తోందని ఆమిర్ చెప్పారు. 

35
మైగ్రేన్ కోసం డైట్ మొదలుపెట్టి

మైగ్రేన్ కోసం ఈ డైట్ మొదలుపెట్టానని, 18 కిలోలు తగ్గడంతో పాటు మైగ్రేన్ కూడా తగ్గిందని ఆమిర్ ఖాన్ అన్నారు.ఇలాంటి మార్పుతో ఆమిర్ గతంలోనూ వార్తల్లో నిలిచారు. 'దంగల్' కోసం ఆయన శారీరక మార్పు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. వృద్ధ మహావీర్ సింగ్ ఫోగట్‌గా కనిపించడానికి, ఆమిర్ 30 కిలోలు పెరిగి 98 కిలోలకు చేరుకున్నారు.

45
ఆమిర్ ఖాన్ రీ ఎంట్రీ ఎప్పుడు?

ఆమిర్ తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 'హ్యాపీ పటేల్'తో చిన్న కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయని ఫుల్ గా రీ ఎంట్రీ ఇవ్వడంలేదు. ఆమిర్ మాట్లాడుతూ.. "ఇది నా కంప్లీట్ రీ ఎంట్రీ కాదు..  మేమిద్దరం అతిధి పాత్రల్లో కనిపిస్తాం" అని  చెప్పారు.

55
హ్యాపీ పటేల్' ప్రీమియర్‌ లో..

'హ్యాపీ పటేల్' ప్రీమియర్‌కు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత ఆమిర్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఇరా ఖాన్, జునైద్ ఖాన్, కిరణ్ రావు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ స్క్రీనింగ్‌కు ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్, సోదరీమణులు కూడా హాజరయ్యారు. 'హ్యాపీ పటేల్' వీర్ దాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఇందులో ఇమ్రాన్ ఖాన్, మోనా సింగ్ కూడా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories