ఆ టైంలో ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయిన మహేష్, మూడేళ్లపాటు కాపాడింది అదే.. అసలేం జరిగిందంటే

Published : Aug 09, 2025, 09:38 AM IST

మహేష్ బాబు తన కెరీర్ లో తీవ్ర ఒత్తిడికి గురైన సందర్భం ఒకటి ఉంది. ఆ టైంలో మహేష్ బాబు మూడేళ్లపాటు గ్యాప్ తీసుకున్నారు. దాని గురించి మహేష్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
మహేష్ బాబు 50 వ పుట్టినరోజు 

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు ఆగష్టు 9న తన 50వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహేష్ 50 వ పుట్టినరోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మహేష్ అభిమానులు కూడా ఘనంగా బర్త్ డే వేడుకల్ని జరుపుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

DID YOU KNOW ?
మహేష్ బాబు తొలి పాన్ ఇండియా చిత్రం
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలనేది జక్కన్న ప్లాన్. 
25
50 ఏళ్ళ వయసొచ్చినా కుర్రాడిలాగే.. 

ఈ చిత్రంతో రాజమౌళి, మహేష్ ఇద్దరూ ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేశారు. ప్రస్తుతం మహేష్ సౌత్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 50 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా మహేష్ కుర్రాడిలాగే చార్మింగ్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు ఎండార్స్మెంట్ లో కూడా రారాజే. 

35
మూడేళ్ళలో 12 బ్రాండ్ లకు సైన్ 

సౌత్ లో ఎండార్స్మెంట్స్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల్లో మహేష్ ఒకరు. మహేష్ బాబు గతంలో మూడేళ్ళలో 12 బ్రాండ్ లకు అంబాసిడర్ గా సైన్ చేశారు. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా ఇంటర్వ్యూలో తెలిపారు. పోకిరి తర్వాత ఎలాంటి సినిమా చేయాలో, ఫ్యాన్స్ ని ఎలా సంతృప్తి పరచాలో అర్థం కాలేదు. పోకిరి తర్వాత చేసిన సైనికుడు, అతిథి వర్కౌట్ కాలేదు. 

45
మూడేళ్లు ఒత్తిడిలో మహేష్ 

అదే టైంలో మా గ్రాండ్ మదర్ మరణించారు. నమ్రత పేరెంట్స్ కూడా మరణించారు. ఆ టైంలో ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. దీనితో మూడేళ్ళ పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా. ఆ టైంలో నమ్రత ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. మూడేళ్లు సినిమాలు చేయలేదు కాబట్టి సంపాదన కోసం 12 బ్రాండ్ లకు సైన్ చేశాను. ఆ టైంలో చేసిన యాడ్స్ వల్ల తిరిగి పుంజుకున్నట్లు మహేష్ తెలిపారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన ఖలేజా ఆకట్టుకోలేకపోయింది. ఆ మరుసటి సంవత్సరం మహేష్ దూకుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 

55
గొప్ప మనసు చాటుకున్న మహేష్ 

యాడ్స్ ద్వారా మహేష్ బాబు భారీగానే సంపాదిస్తున్నారు. మౌంటెన్ డ్యూ అనే బ్రాండ్ కోసం మహేష్ ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఫోన్ పే లాంటి యాప్స్, కూల్ డ్రింక్స్, జ్యువెలరీ ఇలా ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటు సినిమాలు అటు యాడ్స్ తో వందల కోట్లల్లో సంపాదిస్తున్న మహేష్ సేవా కార్యక్రమాల్లో కూడా గొప్ప మనసు చాటుకుంటున్నారు. హృదయ రోగాలతో బాధపడే చిన్నారులకు మహేష్ బాబు సొంత ఖర్చులతో సర్జరీ చేయించి పునర్జన్మ కల్పిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories