కాంతార టీమ్ లో మరో విషాదం
ఏముహుర్తంలో కాంతార ఛాప్టర్ 1మూవీ స్టార్ట్ చేశారోన తెలియదు కాని.. వరుస ప్రమాదాలు ఈమూవీ టీమ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో ఒక సంఘటన జరగడం, ఎవరో ఒకరు చరిపోవడం, లేదా షూటింగ్ కు ఆటంకం కలగడం ఇలా కాంతార టీమ్ ను విషాదాలు నీడలా వెంటాడుతున్నాయి. కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వరుసగా ప్రమాదాలు, విషాద సంఘటనలు ఈ సినిమా టీమ్ ను కలవరపెడుతున్నాయి తాజాగా ఈ టీమ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ థియేటర్ ఆర్టిస్ట్, నటుడు టి ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు.ఆగస్టు 8 (శుక్రవారం) ఉదయం 8:30 గంటల సమయంలో ఆయన ఉడిపిలోని హిరియడ్కలోని తన నివాసంలో కుప్పకూలిపోయారు. గతంలో ఆయనకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్టు తెలుస్తోంది. స్టంట్లు కూడా వేసినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ఆయన తలతిరుగుతూ పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలిసింది. అయితే, అనూహ్యంగా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.