సూపర్ స్టార్ కృష్ణ తర్వాత టాలీవుడ్ లో అరుదైన రికార్డ్ సాధించిన హీరో ఒకరు ఉన్నారు. ఆ రికార్డ్ ఏంటి, దాని గురించి కృష్ణ చెప్పిన విశేషాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఇంకెవరికీ సాధ్యం కానీ రికార్డులు సాధించారు. కృష్ణ రాకతో టాలీవుడ్ లో సినిమా మేకింగ్ వేగం పెరిగింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఏకంగా 350 పైగా చిత్రాల్లో నటించారు. ఇది ఏ ఇతర హీరో చేరుకోలేని రికార్డు. సూపర్ స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో అప్పటి తన బిజీ షెడ్యూల్ ని గుర్తు చేసుకున్నారు.
DID YOU KNOW ?
సూపర్ స్టార్ కృష్ణ ట్రిపుల్ రోల్స్ రికార్డ్
సూపర్ స్టార్ కృష్ణ ట్రిపుల్ రోల్స్ లో ఏకంగా 7 చిత్రాల్లో నటించారు. కృష్ణకి ఉన్న అరుదైన రికార్డుల్లో ఇది కూడా ఒకటి.
25
కెరీర్ ని మలుపు తిప్పిన గూఢచారి 116
సూపర్ స్టార్ కృష్ణ తేనే మనసులు చిత్రంతో 1965లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్లలో కృష్ణ కేవలం 3 సినిమాల్లో మాత్రమే నటించారు. తేనె మనసులు, కన్నె మనసులు, గూఢచారి 116 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ గూఢచారి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తాను వెనుదిరిగి చూసుకోలేదని కృష్ణ అన్నారు. ఆ చిత్రం తర్వాత అవకాశాలు భారీగా పెరిగాయి. దీనితో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మూడు షిఫ్టుల్లో వివిధ చిత్రాలకు పనిచేయాల్సి వచ్చేది అని కృష్ణ అన్నారు.
35
ఒకే రోజు రెండు చిత్రాలు
1972 లో అయితే తాను నటించిన 18 చిత్రాలు రిలీజ్ అయ్యాయి అని కృష్ణ తెలిపారు. ఈ రికార్డు టాలీవుడ్ చరిత్రలో చెక్కు చెదరకుండా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పటి సినిమా మేకింగ్ స్టైల్ ని బట్టి ఈ తరం హీరోలు ఏడాదికి ఒక చిత్రంలో నటించడం కూడా కష్టం అయిపోతోంది. ఒకే రోజు తాను నటించిన రెండు చిత్రాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని కృష్ణ అన్నారు.
టాలీవుడ్ లో తన తర్వాత ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజ్ చేసిన హీరో నందమూరి బాలకృష్ణ అని కృష్ణ తెలిపారు. బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు 1993లో సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యాయి.
55
నటనే నా జీవితం
ఇలా షిఫ్ట్ ల వారీగా అర్ధ రాత్రి వరకు నటించడం కష్టంగా అనిపించలేదా అని ప్రశ్నించినప్పుడు.. నటనే నా జీవితం కాబట్టి ఎంజాయ్ చేస్తూ నటించాను. పైగా ఆ టైంలో నేను కుర్రాడిని. కాబట్టి ఉత్సాహంగా పనిచేసినట్లు కృష్ణ తెలిపారు. కొన్నేళ్ల తర్వాత సినిమాల నిర్మాణ ఖర్చులు పెరిగాయి. దీనితో ఏడాదికి 7 సినిమాలకు మించి చేయకూడదు అనుకున్నా. కానీ మొహమాటం వల్ల 10 చిత్రాల్లో కూడా నటించాల్సి వచ్చింది అని కృష్ణ తెలిపారు.