ఆచారం పేరుతో అత్యాచారం, స్వామీజీ ముసుగులో సీక్రేట్ వ్యవహారం, ఓటీటీని ఊపేస్తోన్న మూవీ ఏదో తెలుసా?

Published : Apr 18, 2025, 12:54 PM IST

ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్  ఆడియన్స్ ను తెగ ఆకర్శిస్తోంది. కొత్త దర్శకులకు ఓటీటీ వరంలా దొరికింది. రకరకాల ఐడియాలను సినిమాలుగా రూపొందించి.. థియేటర్లను నమ్ముకోకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా ఓటీటీలో బోలెడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చి చేరుతోంది. అలాంటి వాటిలో ఓ సినిమా ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తోంది. తానే దేవుడిగా కొలువబడుతున్న ఓ స్వామిజీ, ఆచారం పేరుతో అతను చేసే అరాచకాలు, వాటిని గుడ్డిగా నమ్మే భక్తులు. స్వామి బండారం బయట పెట్టిన హీరో. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా  ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తోంది. 

PREV
15
ఆచారం పేరుతో  అత్యాచారం, స్వామీజీ ముసుగులో సీక్రేట్ వ్యవహారం, ఓటీటీని ఊపేస్తోన్న మూవీ ఏదో తెలుసా?

ఈమధ్య కాలంలో ఓటీటీలో అన్ని జానర్స్ లో అద్భుతమైన  సినిమాలు వస్తున్నాయి. థియేటర్ లో చూడలేని అద్భుతాలు ఓటీటీలో చూసేస్తున్నారు ఆడియన్స్.  హారర్, సస్పెన్స్, మిస్టరీ, రొమాన్స్, ఇలా ఏది కావాలన్నా ఓటీటీలో అందుబాటులో ఉంది.

అంతే కాదు కొన్ని సినిమాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కినవి కూడా  ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రియల్ లైఫ్ స్టోరీస్ కు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా సైతం అలాంటిదే. ఇది  రియల్ లైఫ్ లో జరిగిన ఓ దొంగ స్వామిజీ కథ  ఆధారంగా తెరెక్కించారు. 

Also Read: తనతో 23 హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ ను అవమానించిన మెగాస్టార్, చిరంజీవిని స్టార్ హీరోను చేసిన దర్శకుడెవరు

25
Maharaj Movie

ఈ కథలో  మలుపులు, ట్విస్ట్ లు, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.  స్వామిజీ ముసుగులో అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ఓ దొంగబాబా, జనాలను ఎలా మాయ చేశాడు, ఎలా ఆకట్టుకున్నాడు అనేది సినిమాగా తెరకెక్కించారు.  ఈసినిమా ఊహించని మలుపులతో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది.

మూఢ నమ్మకాలు, ప్రజల సెంటిమెంట్, ఎమోషన్స్, మత విశ్వాసాల  గురించి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమా మన దేశానికి ఫ్రీడం రాకముందు జరిగిన కథ. జదునాథ్ మహారాజ్ పేరుతో ఓ కాస్ట్లీ స్వామిజీ అమ్మాయిల జీవితాలతో ఎలా ఆడుకున్నాడో తెలిపే కథ.  ఈ సినిమా పేరు ‘మహారాజ్’. 2024లో రిలీజ్ అయ్యింది.  

Also Read:  ఆలియా భట్ కంటే ముందు, రణ్ బీర్ డేటింగ్ చేసిన 5 గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

35
Maharaj Movie

సౌరభ్ షా  రాసిన నవల ఆధారంగా మహరాజ్  సినిమా తెరకెక్కింది.  1862లో బొంబాయిలో జరిగిన ప్రసిద్ధ ‘మహారాజ్ పరువు నష్టం కేసు’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్  అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జునైద్ తో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్  షాలినా పాండే,   జైదీప్ అహ్లావత్, శర్వరీ వాఘ్ లాంటి సీనియర్ స్టార్స్ యాక్ట్ చేయగా,  సిద్ధార్థ్ మల్హోత్రా  డైరెక్ట్ చేశాడు. వైఆర్‌ఎఫ్ ఎంటర్‌ టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించారు. 

Also Read:  మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

45
Maharaj Movie

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈసినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. హీరో పాత్ర పేరు కర్సందాస్ ,  అతను  ఒక విద్యావంతుడు. సంఘ సంస్కర్త. మహిళల హక్కులు, వితంతు పునర్వివాహం కోసం పోరాడే ధైర్యవంతుడు. మూఢనమ్మకాలను ఎదిరించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కర్సందాస్, తన మామ ఇంట్లో పెరిగి కిషోరి( షాలినీ పాండే) అనే యువతితో నిశ్చితార్థం చేసుకుంటాడు. 

55
Shalini Pandey maharaj movie

ఆ దొంగ  స్వామిజీ కిషోరి జదునాథ్ మహారాజ్ (JJ)  కన్ను కిషోరిపై పడుతుంది. “చరణసేవ” పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండే అతని  మోసాన్ని గురించి తెలుసుకున్న కర్సాందాస్ అతడి వ్యవహరం భయటపెడతాడు. అతన్ని కోర్ట్ కు రప్పిస్తాడు. ఈమధ్యలో జరిగిన ఎన్నో సంఘటనలు హీరో పాత్రను ఇబ్బందులకు గురి చేస్తాయి. స్వామిజీ కూడా తప్పించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కాని చివరకు అతని బండారం భయటపడుతుంది. నిజ జీవింతలో జరిగిన ఈ సంఘటన, సినిమాగా వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ ను  సాధించింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories