కాంతారావు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400 పైగా చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు కాంతారావు అంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. పౌరాణిక, జానపద చిత్రాల్లో కాంతారావుకి అద్భుతమైన గుర్తింపు దక్కింది. అనేక చిత్రాల్లో నారదుడిగా కూడా నటించారు. క్రేజ్ విషయంలో కాంతారావు టాప్ రేంజ్ కి చేరుకోలేకపోయారు. కానీ ఆస్తుల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలతో పాటుగా బాగా సంపాదించాల్సింది. కొంతవరకు సంపాదించారు కూడా.