ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, రాధ చెప్పిన ఆ తాగుబోతు వ్యక్తి కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు మాధవని చూసిన ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మాధవ నువ్వు ఇక్కడికి వస్తావని ముందే తెలిసి ఆలోచించి వాడిని ఇక్కడి నుంచి పంపించేశాను అనటంతో ఆదిత్య కోపంతో మాధవ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు మాధవ, నా గురించి తెలిసి కూడా ఇలా పదేపదే కాలర్ పట్టుకుంటున్నావు అని అనగా వెంటనే ఆదిత్య నేను ఒక్క క్షణం గట్టిగా అనుకున్నాను అంటే నువ్వు అనేవాడివి ఉండవు అని వార్నింగ్ ఇస్తాడు.