సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం మహేష్ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. దీనితో మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు ? మాస్ లుక్కా.. క్లాస్ లుక్కా ? ఇలా ఫ్యాన్స్ లో చాలా సందేహాలు ఉన్నాయి. తాజాగా బయటకి వస్తున్న మహేష్ బాబు లేటెస్ట్ పిక్స్ అభిమానులని కుదురుగా ఉండనీయడం లేదు.
తాజాగా మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితారతో కలసి ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే డాన్స్ ఇండియా డాన్స్ షోకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. సితార ఎప్పటిలాగే క్యూట్ గా ఆకట్టుకుంటోంది. తండ్రితో కలసి సితార చేస్తున్న సందడి చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. డాన్స్ అంటే ఒక సెలెబ్రేషన్స్ అంటూ మహేష్ బాబు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇక మహేష్ బాబు లుక్ అయితే అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. తొలిసారి మహేష్ బాబు మీసాలు, గడ్డం పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. మహేష్ బాబు ఆన్ స్క్రీన్ పై పెద్ద మీసాలు, గడ్డం, షర్ట్ లేకుండా కనిపించడం చేయలేదు.
బహుశా ఈ సర్ప్రైజ్ లు అన్నీ SSMB28లో తివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. పోకిరి తర్వాత అలాంటి ఊరమాస్ లుక్ లో మహేష్ కనిపించింది లేదు. సర్కారు వారి పాటు చిత్రంలో కొత్త లుక్ ట్రై చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో హైలైట్ కాలేదు.
ఇటీవల మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా కండలతో కనిపించారు. ఈ చిత్రం కోసం మహేష్ బాడీ బిల్డ్ చేస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది. మొత్తంగా త్రివిక్రమ్ మహేష్ ఫ్యాన్స్ కోసమా కోసం అల్టిమేట్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారనేది వాస్తవం. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కోట్ల ఖర్చుతో భారీ సెట్స్ నిర్మిస్తున్నారట.