ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసుధార వచ్చినట్లుగా ఊహించుకొని కూర్చో వసుధార అనే అంటాడు. కానీ అక్కడ వసుధార లేకపోయేసరికీ అదంతా తన భ్రమ అనుకుంటుంది. మరొకవైపు వసుధార కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి , డి బి ఎస్ టి కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటూ వాట్సాప్ లో ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఆ గ్రూప్ ని చూసుకున్న జగతి సంతోషపడగా,వసు మాత్రం గుడ్ ఐడియా సార్ అని మెసేజ్ చేస్తుంది. అప్పుడు ఆ గ్రూప్ కి సంబంధించిన మెసేజ్లు వసుధార, పుష్ప,జగతి, రిషి లు చదువుకుంటూ ఉంటారు.