నా దగ్గర దాయొద్దు అని మాధవ్ని అడగగా "నువ్వు అక్క, బావ అని ఇంత ప్రేమగా పిలుస్తున్నావు కాబట్టి చెప్తున్నాను,ఈ మధ్య రాధ అసలు ఇంట్లో మనిషిలాగే ఉండట్లేదు పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ఆ ఫోన్లోనే మాట్లాడుతుంది" అని మాయమాటలు చెప్పి సత్యం మనసులో విషయం నింపుతాడు మాధవ్. సత్య మనసులో,"అయితే ఆదిత్య రోజంతా ఫోన్ మాట్లాడుతుంది అక్కతో నా, బయటకి కలవడానికి వెళుతుంది కూడా అక్క కోసమేనా" అని అనుకుంటుంది.