ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ, జానకిని గది లో నుంచి బయటకు పిలుస్తూ ఇవి మన వంశపారంపర్యంగా వస్తున్న తోరాలు. మనల్ని ఎల్లకాలం చల్లగా చూస్తున్న తోరాలు. అలాంటి వీటిని నీ పుస్తకాలు పెట్టడం కోసం కింద పారేస్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు?.షరతులు పెట్టి 24 గంటలు కూడా అవ్వలేదు. అప్పుడే దాన్ని హద్దు మీరావు. నీ చదువు కారణంగా నీ భర్తనీ, ఇంటిని తక్కువ చేయకుండా ఉండాలి అని చెప్పాను.