RC17: మీరు ఎంతైనా ఊహించుకోండి, రామ్‌ చరణ్‌తో మూవీపై అంచనాలు పెంచిన సుకుమార్‌.. అదిరిపోయే హింట్‌

Published : Jun 24, 2026, 06:43 AM IST

రామ్‌ చరణ్‌ నెక్ట్స్ సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన హిట్‌ ఇచ్చాడు సుకుమార్‌. సింపుల్‌ గా ఒకే మాటతో అంచనాలను అమాంతం పెంచేశాడు. 

PREV
14
పెద్ది సక్సెస్‌ సెలబ్రేషన్‌

రామ్‌ చరణ్‌ ఇటీవల `పెద్ది` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఇది భారీ వసూళ్లని రాబట్టింది. సుమారు నాలుగు వందల వరకు రాబట్టిందని సమాచారం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జూన్‌ 4న విడుదలై ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో `పెద్ది` సక్సెస్ సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఇందులో చిరంజీవి గెస్ట్ గా పాల్గొన్నారు. రామ్‌ చరణ్‌పై, పెద్దిపై ప్రశంసలు కురిపించారు. అలాగే సుకుమార్‌ కూడా ప్రశంసలు కురిపించారు. 

24
రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై సుకుమార్‌ ప్రశంసలు

ఈ ఈవెంట్‌కి సుకుమార్‌ కూడా వచ్చారు. సినిమాపై, చరణ్‌ నటనపై ప్రశంసలు కురిపించారు. రామ్‌ చరణ్‌ అద్బుతంగా నటించాడని తెలిపారు. `రంగస్థలం` ని మించి చేశాడని, చరణ్‌ని నటనని చూస్తుంటే ఆశ్చర్యమేసిందని, అన్నీ మర్చిపోయి ఆయన యాక్టింగ్‌ని చూశామని చెప్పారు. ఈ క్రమంలో అభిమానుల నుంచి తన సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ని డిమాండ్‌ చేశారు. రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ నెక్ట్స్ సినిమా చేయబోతున్నారు. దీని అప్‌ డేట్‌ కావాలని అభిమానులు కోరగా, అదిరిపోయే హింట్ ఇచ్చాడు సుకుమార్‌.

34
ఆర్‌సీ17 పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చిన సుకుమార్‌

సినిమా గురించి తానేమీ చెప్పనని, తాను మాటలు చెప్పేవాడిని కాదని తెలిపారు. రెండు మూడు సార్లు ఈ విషయాన్ని రిపీట్‌ చేశాడు. మీరు ఎంత అడిగినా చెప్పను అని, మీరు ఎంతైనా ఊహించుకోమని తెలిపారు. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి సినిమా ఉంటుందనే విషయాన్ని సుకుమార్‌ తెలిపారు. ఒక్క మాటతోనే `ఆర్‌సీ17`పై అంచనాలను అమాంతం పెంచేశాడు సుకుమార్‌. ఆయన కామెంట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. సుకుమార్‌ చివరగా `పుష్ప 2` రూపొందించారు. ఇది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.

44
చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో గతంలో `రంగస్థలం`

సుకుమార్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో గతంలో `రంగస్థలం` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసింది. రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ఇందులో రామ్‌ చరణ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories