ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు లెక్కలేనన్ని వచ్చేవి.ఎన్టీఆర్, ఏఎన్నార్.. కృష్ణ, శోభన్ బాబు అనేక చిత్రాల్లో కలసి నటించారు. ఎన్నో చిత్రాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు తగ్గిపోయాయి. హీరోలు ఎవరికి వారు సోలోగా సినిమాలు చేస్తూ వచ్చారు.
ఇటీవల రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తెరకెక్కించారు. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరహాలో మరో మల్టీస్టారర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో కలలో కూడా ఊహించలేని కాంబినేషన్స్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ప్రయత్నాలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ గురించి ఎవరైనా ఊహించగలరా.. కానీ నిజంగానే చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి.
ఆంధ్రావాలా చిత్ర నిర్మాత గిరి ఈ విషయాన్ని తెలిపారు. ఎన్టీఆర్ కి కెరీర్ బిగినింగ్ లో మెగా ఫ్యామిలీపై కోపం ఉండేదట. ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు కావాలనే అతడిలో మెగా ఫ్యామిలీపై ద్వేషం పెంచారు. తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పుడు మాటలు చెప్పారు. దీనితో ఎన్టీఆర్ అప్పట్లో చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వివాదం అయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ కి నా లాంటి వాళ్ళం వాస్తవాలు చెబుతూ వచ్చాం. దీనితో మెగా ఫ్యామిలీపై ఎన్టీఆర్ కి నెగిటివిటి తగ్గిపోయింది అని గిరి తెలిపారు.
ఆ తర్వాత ఎన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అంతకు ముందు నన్ను కూడా ఎన్టీఆర్ కొన్ని రోజులు దూరం పెట్టాడు. కొందరు చెప్పుడు మాటల వల్ల అలా జరిగింది. అంతా సద్దుమణిగాక నల్లమలపు బుజ్జి నన్ను ఎన్టీఆర్ దగ్గరకి తీసుకుని వెళ్ళాడు. వేరే వ్యక్తుల వల్ల మనమధ్య గ్యాప్ వచ్చింది. ఇక అలా జరగదు అని ఎన్టీఆర్ నాతో చెప్పారు. ఒకరోజు నన్ను, బుజ్జిని తీసుకుని రాజమౌళి వద్దకు ఎన్టీఆర్ వెళ్ళాడు. మనం గిరి అన్నకి ఒక సినిమా చేయాలి అని రాజమౌళితో చెప్పాడు. రాజమౌళి కూడా ఒకే అలాగే చేద్దాం అని అన్నారు.
రోజులు గడుస్తున్నాయి కానీ కాంబినేషన్ కుదరడం లేదు. ఒక రోజు నేను ఎన్టీఆర్ కి చిరంజీవితో మల్టీస్టారర్ చిత్రం గురించి చెప్పాను. భారతదేశం గర్వించదగ్గ మహారాజుల్లో ఒకరైన మహా వీర్ రాణాప్రతాప్ సింగ్ కథ ఉంది. ఈ కథని చిరంజీవి గారితో కలసి చేస్తే బావుంటుంది అని చెప్పా. అక్బర్, రాణా ప్రతాప్ మధ్య చాలా జరిగింది. ఈ రెండు పాత్రల్లో చిరంజీవి, ఎన్టీఆర్ నటించాలి. ఎన్టీఆర్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. రాజమౌళి లాంటి దర్శకుడు అయితే బావుంటుంది అని చెప్పా. కానీ రాజమౌళి దొరకడం కష్టం. అంతా ఓకే అయితే సురేందర్ రెడ్డిని డైరెక్టర్ గా ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ ప్రాజెక్ట్ చిరంజీవి వరకు వెళ్ళలేదు అని గిరి అన్నారు.
అక్బర్ కూడా గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. అక్బర్, రాణా ప్రతాప్ మధ్య చాలా పోరాటం జరిగింది. ఆ కథలో చిరంజీవి, ఎన్టీఆర్ నటిస్తే ఎలాంటి బాక్సాఫీస్ రికార్డు మిగలదని చాలా మంది ఒపీనియన్. ఎన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్ సెట్ కాలేదు.. కానీ ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ మాత్రం వర్కౌట్ అయింది.