`లక్కీ భాస్కర్‌`, `క` ఆరు రోజు కలెక్షన్లు.. కిరణ్‌ అబ్బవరం, దుల్కర్‌ సల్మాన్‌ సక్సెస్‌ అయ్యారా?

First Published | Nov 6, 2024, 5:21 PM IST

`లక్కీ భాస్కర్‌`, `క` సినిమాలు దీపావళి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే 
 

దీపావళి సందర్భంగా రెండు తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్‌ సినిమాలు విడుదలయ్యాయి. తెలుగు సినిమాలు కిరణ్‌ అబ్బవరం నటించిన `క`, అలాగే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన `లక్కీ భాస్కర్‌` సినిమాలు దీపావళి కానుకగా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతోపాటు తమిళ మూవీ `అమరన్‌` కూడా హిట్‌ టాక్‌ వచ్చింది. 
 

కిరణ్‌ అబ్బవరం హీరోగా `క` సినిమా రూపొందింది. సుజీత్‌, సందీప్‌ దర్శకద్వయం రూపొందించిన ఈ మూవీ దీపావళికి రిలీజ్‌ అయ్యింది. ఇందులో తన్వి రామ్‌, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ప్రారంభం నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. దీంతో ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. 
 


కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ దుమ్మురేపుతుంది. తాజాగా ఈ మూవీ ఆరు రోజుల్లో 32.64 కలెక్షన్లు వసూలు చేసింది. ఈ లెక్కన ఇది దాదాపు 17కోట్ల షేర్‌ సాధించింది. ఈ మూవీకి 12కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. దీంతో సినిమా ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి వెళ్లింది. ఈ మూవీతో కిరణ్‌ పెద్ద హిట్‌ కొట్టాడని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాకి మరిన్ని కలెక్షన్ల దిశగా వెళ్తుందని చెప్పింది. సినిమా బడ్జెట్‌కి, రేంజ్‌ విషయంలో చూస్తే ఇది పెద్ద రేంజ్‌ సినిమా కాబోతుందని చెప్పొచ్చు. 
 

ఇక ఈ దీపావళికి వచ్చిన చిత్రాల్లో దుల్కర్‌ సల్మాన్‌ `లక్కీ భాస్కర్‌` పాజిటివ్‌ తెచ్చుకుంది. ఈ సినిమాకి సైతం పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సుమారు 30కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ డిసెంట్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. మంచి కలెక్షన్లతో రన అవుతుంది. ఆరు రోజుల్లో ఈ చిత్రం 67.6కోట్లు వసూలు చేయడం విశేషం. అంటే ఈ లెక్కన ఈ మూవీ కూడా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఇవన్నీ టీమ్‌ ప్రకటించిన అధికారిక లెక్కులు. వాస్తవ కలెక్షన్లు తెలియాల్సి ఉంది. 
 

బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. 

read more: ఏఎన్నార్‌కి తెలిస్తే కొడతాడని, బీర్‌ తాగడం కోసం నాగార్జున ఏం చేశాడో తెలుసా? ఇది ఊరమాస్‌ లెక్క

also read: సినిమా రిలీజ్‌ అయ్యాక సాంగ్‌ షూటింగ్‌, ఫలితం చూశాక కూడా అంటే బాలకృష్ణకే సాధ్యం, రాజమౌళి నుంచి ఇది ఊహించలేం

Latest Videos

click me!