రానా సెటైర్.. హరీష్ శంకర్ కౌంటర్!

First Published | Nov 6, 2024, 4:32 PM IST

ఐఫా వేడుకల్లో దగ్గుబాటి రానా చేసిన వెటకారపు వ్యాఖ్యలు హరీష్ శంకర్‌కి గుచ్చుకున్నాయి. 'మిస్టర్ బచ్చన్' సినిమా పరాజయం గురించి రానా చేసిన వ్యాఖ్యలపై హరీష్ శంకర్ స్పందించారు.

కొన్ని వెటకారాలు నవ్వుకోవటానికి అప్పటికప్పుడు బాగున్నా...అవి ఎవరినైతే ఉద్దేశించారో వారికి మాత్రం తగులుతాయి. భాధిస్తాయి. అలా దగ్గుపాటి రానా వేసిన ఓ సెటైర్ హరీష్ శంకర్ కు గుచ్చుకుంది. ఆయన స్పందించారు.

2024 ఐఫా వేడుకలు సెప్టెంబర్లో (International Indian Film Academy Awards) అబుదాబిలో అట్టహాసంగా జరిగాయి. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. రానా, తేజ జోడిగా హోస్ట్ చేస్తూ తమదైన శైలిలో కొంతమంది హీరోల సినిమాలపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఓ సినిమాను ఉద్దేశించి సరదాగా ట్రోల్ చేసిన రానా.. ఒక్కసారిగా వివాదంలో ఇరుక్కున్నాడు. 


'పుష్ప-2 రిలీజ్ బాగా లేట్ అయింది కాబట్టి.. సినిమా పేరు Pushpa TooLate అంటూ పేరు మార్చారు అని తేజ చదివారు. అదే రిలీజ్ షిఫ్ట్ అవుతోంది కదా.. మళ్లీ ఇంకోసారి షిఫ్ట్ అయితే.. జనాలకు కూడా అలవాటు చేద్దామని అలా రాసారు అని రానా చెప్పడంతో సెలబ్రేటిస్ అందరు నవ్వుకున్నారు.

అలాగే ఆదిపురుష్ సినిమాకు ప్రతి సీట్ ఆడియన్స్ కి వదిలేసారు కదా.. ఆంజనేయ స్వామి కూడా ఓటీటీలో చూద్దామని వదిలేశాడు అంటూ తేజ చెప్పడంతో నవ్వుకున్నారు. 
 



ఈ క్రమంలో "బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై.. లోయెస్ట్లో చూశారు" అని రానా అనగా.. పక్కనే ఉన్న సజ్జా ‘‘హైయెస్ట్ హై కల్కి.. మరి లోయెస్ట్లో ఏంటి?’’ అని ప్రశ్నించాడు.

దాంతో రానా మరింత వెటకారంగా "అదే మొన్న రిలీజైంది కదా.. మిస్టర్....?" అంటూ సాగదీశాడు. దాంతో సజ్జా చెప్పొద్దంటూ ఆపాడు. ఇక ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీశ్ శంకర్ వరకూ చేరింది. 


ఈ వీడియోను ఓ అభిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)కు ట్యాగ్ చేస్తూ.."మీరు రవితేజ అన్నతో మళ్లీ సినిమా తీయాలి. మేము కాలర్ ఎగురవేయాలన్నా.. మీ రిప్లై కావాలి" అంటూ రాసుకొచ్చాడు.

దాంతో హరీశ్ శంకర్ కూడా ట్విట్టర్ X లో తనదైన శైలిలో స్పందించాడు. "ఎన్నో … విన్నాను తమ్ముడు … అందులో ఇదోటి … అన్ని రోజూలు ఒకేలా ఉండవు.. నాకైనా… ఎవరికైనా" అంటూ హరీశ్ శంకర్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.


మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీకి రూ.31 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు రూ.8కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ సాధించింది.

దీంతో ఈ చిత్ర నిర్మాత‌ల‌కు రూ.25 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చిందిని ట్రేడ్ వర్గాల అంచనా. ‘మిస్టర్ బచ్చన్’ ఫెయిల్యూర్ తర్వాత ఆయన కొంచెం దూకుడు తగ్గించాడు. ఈ క్రమంలోనే ఇలా వేదాంత ధోరణిలో సమాధానం చెప్పినట్లు కనిపిస్తోంది.  

Latest Videos

click me!