రక్షకుడు మూవీలో నాగార్జున హెయిర్ స్టైల్ అంటే పిచ్చి, అందుకే కూలీలో విలన్ గా.. లోకేష్ కనకరాజ్ కామెంట్స్

Published : Jul 25, 2025, 08:05 PM IST

కూలీ చిత్రంలో నాగార్జునని ఎందుకు విలన్ గా తీసుకున్నారు అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రివీల్ చేశారు. రక్షకుడు చిత్రంలో నాగార్జున హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. 

PREV
15
కూలీలో విలన్ గా నాగార్జున

కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రీసెంట్ గా కుబేర చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఆ మూవీ మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

25
మోనికా సాంగ్ వైరల్

కూలీ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ 'మోనికా' సినిమాపై అంచనాలు పెంచేసింది. లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో నాగార్జునని ఈ చిత్రంలో ఎందుకు విలన్ గా తీసుకున్నారో వివరించారు.

35
నాగ్ సార్ కి అభిమానిని

నాగార్జున ఫ్యామిలీ స్టోరీలు, రొమాంటిక్ చిత్రాలు చేసే హీరో. అలాంటి హీరోని విలన్ గా ఎలా తీసుకోవాలని అనిపించింది అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి లోకేష్ కనకరాజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేను నాగార్జున సార్ కి చిన్నప్పటి నుంచి పెద్ద అభిమానిని. శివ మూవీ అంటే చాలా ఇష్టం.

45
అందుకే విలన్ గా తీసుకున్నా

కానీ రక్షకుడు మూవీలో ఆయన హెయిర్ స్టైల్ చూసి ఇంకా అభిమానం పెరిగింది. ఆ చిత్రంలో నాగ్ సార్ ఫంకీ హెయిర్ స్టైల్ అంటే నాకు పిచ్చి. ఆ హెయిర్ స్టైల్ గుర్తుకు వచ్చే నాగ్ సార్ ని విలన్ గా తీసుకోవాలనుకున్నా. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా హీరోగా చేస్తున్నారు. నా చిత్రంలో కొత్తగా చూపించాలని అనుకున్నా.

55
నాగ్ సార్ ఫ్యాన్స్ కి నచ్చే చాలా అంశాలు ఉన్నాయి

మొదట్లో ఆయన విలన్ గా నటించాలి అంటే చాలా ఆలోచించారు. నేను కథ మొత్తం చెప్పినప్పుడు ఒకే చెప్పారు. ఈ మూవీలో నాగ్ సార్ ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు చాలా ఉంటాయి అని లోకేష్ కనకరాజ్ తెలిపారు. ఈ మూవీలో శృతి హాసన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories