క్రిష్ జాగర్లమూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ.. చరిత్ర సృష్టించిన చిత్రానికి సీక్వెల్ ?

Published : Jul 25, 2025, 07:15 PM IST

నందమూరి బాలకృష్ణ మరో దర్శకుడిని రిపీట్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక చిత్రానికి సీక్వెల్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. 

PREV
15
దర్శకులని రిపీట్ చేస్తున్న బాలయ్య 

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎక్కువగా దర్శకులని రిపీట్ చేస్తున్నారు. ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో నాల్గవ చిత్రంలో బాలయ్య నటిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా మరోసారి నటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

25
క్రిష్, బాలయ్య కాంబినేషన్ 

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య మూడవసారి నటించేందుకు రెడీ అవుతున్నారట. గతంలో వీరిద్దరి కాంబోలో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం వచ్చింది. ఈ మూవీ ఎలా ఉన్నప్పటికీ క్రిష్ ఎంచుకున్న కాన్సెప్ట్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ఫెయిల్ అయ్యాయి. కానీ క్రిష్ వర్క్ పై బాలయ్యకి నమ్మకం ఉందట. 

35
ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్?

అందుకే మూడవసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి వీరిద్దరి కాంబోలో వచ్చే చిత్రం గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ చిత్రాన్ని క్రిష్ రూపొందించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. 

45
టైటిల్ అదేనా.. 

ఈ చిత్రానికి ఆదిత్య 999 అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట. మరి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది త్వరలోనే తేలనుంది. గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా పార్లల్ గా ప్రారంభించాలని బాలయ్య భావిస్తున్నట్లు టాక్. 

55
అఖండ 2తో బాలయ్య బిజీ 

హరిహర వీరమల్లు చిత్రంలో కొంత భాగం క్రిష్ దర్శకత్వంలో రూపొందింది. క్రిష్ తెరకెక్కించినంత వరకు ఈ మూవీ బావుంది అని అంటున్నారు. కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం క్రిష్ అనుష్క శెట్టితో ఘాటి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలయ్య అఖండ 2తో బిజీగా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories