తెలుగు సీరియల్స్ కి సంబంధించిన గత వారం టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇందులో ఏ సీరియల్ నెంబర్ వన్‌లో ఉంది. ఏ టీవీ సీరియల్స్ ఎక్కువ ఆదరణ పొందుతున్నాయనేది చూస్తే.
తెలుగులో సీరియల్స్ మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ఛానెల్స్ మాత్రమే టాప్‌లో ఉంటున్నాయి. వాటికి సంబంధించిన సీరియల్స్ రేటింగ్‌లో దూసుకుపోతున్నాయి.
ఈ క్రమంలో గత వారం టెలికాస్ట్ అయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇందులో టాప్ సీరియల్స్ ఏంటో తేలిపోయింది. ఇందులో స్టార్ మా సీరియల్స్ టాప్‌లో ఉంటున్నాయి. చాలా వరకు వాటి ప్రభావమే ఉంటుంది.
వీటితోపాటు జీ తెలుగు సీరియల్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మరి లేటెస్ట్ రేటింగ్‌లో ఏ సీరియల్ టాప్‌లో ఉందనేది తెలుసుకుందాం.
211
మొదటి స్థానంలో కార్తీక దీపం 2 సీరియల్
స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న `కార్తీక దీపం 2` సీరియల్ మరోసారి టాప్ లో నిలిచింది. ఇది 14.42 రేటింగ్‌తో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది చాలా రోజులుగా మొదటి స్థానంలో ఉంది.
311
రెండో స్థానంలో `గుడిగంటలు`
స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న `గుండె నిండా గుడి గంటలు` సీరియల్ రెండో స్థానంలో నిలిచింది. ఇది 13.11 టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకుంది.
స్టార్ మాలో రన్ అవుతున్న `ఇంటింటి రామాయణం` సీరియల్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. దీనికి 12.92 రేటింగ్ దక్కింది.
511
నాల్గో స్థానంలో `ఇల్లు ఇల్లాలు పిల్లలు`
టాప్ 10 తెలుగు సీరియల్స్ లో స్టార్‌మాలోని మరో సీరియల్ `ఇల్లు ఇల్లాలు పిల్లలు` కూడా టాప్‌లో ఉంది. ఇది నాల్గో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనికి 12.36 రేటింగ్ వచ్చింది.
611
ఐదో స్థానంలో `నువ్వుంటే నా జతగా`
స్టార్ మాలోని మరో సీరియల్ `నువ్వుంటే నా జతగా` సైతం దుమ్మురేపుతుంది. ఇది 10.36 రేటింగ్‌తో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.
711
ఆరో స్థానంలో `చిన్ని`
స్టార్ మాలోని మరో సీరియల్ `చిన్ని` టాప్ 6లో నిలిచింది. దీనికి 8.02 రేటింగ్ రావడం విశేషం. ఇలా వరుసగా ఆరు స్టార్ మా సీరియల్స్ టాప్ లో ఉన్నాయి.
811
ఏడో స్థానంలో `చామంతి`
జీ తెలుగు సీరియల్స్ కూడా సత్తా చాటుతున్నాయి. `చామంతి` సీరియల్ ఏడో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనికి 7.25 రేటింగ్ వచ్చింది. జీ తెలుగులో ఇది మొదటి స్థానంలో ఉంది.
911
ఎనిమిదో స్థానంలో `జగద్ధాత్రి`
జీ తెలుగు సీరియల్ `జగద్ధాత్రి` టాప్ తెలుగు సీరియల్స్ లో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనికి 7.11 రేటింగ్ వచ్చింది. జీ తెలుగులో ఇది రెండో స్థానంలో ఉంది.
1011
తొమ్మిదో స్థానంలో `మేఘ సందేశం`
జీ తెలుగుకి చెందిన సీరియల్ `మేఘ సందేశం` తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనికి 7.06 రేటింగ్ వరించింది. ఇది జీ తెలుగులో టాప్ 3లో ఉండటం విశేషం.
1111
పదో స్థానంలో `బ్రహ్మముడి`
తెలుగు సీరియల్స్ టాప్ 10లో చివరగా `బ్రహ్మముడి` నిలిచింది. దీనికి 6.96 రేటింగ్ వచ్చింది. ఇది స్టార్ మాలో ఏడో స్థానంలో నిలిచింది.