Lokah Records: `కొత్త లోక` మూవీ సరికొత్త సంచలనం, దెబ్బకి మోహన్‌ లాల్‌ రికార్డులు బ్రేక్‌

Published : Sep 15, 2025, 09:03 PM IST

 కళ్యాణి ప్రియదర్శన్ నటించిన `లోక చాప్టర్ 1: చంద్ర`(కొత్త లోక) సినిమా కొత్త రికార్డ్ సృష్టించింది. మోహన్‌ లాల్ కి పెద్ద షాకిచ్చింది. ఆ కథేంటో తెలుసుకుందాం.  

PREV
14
మోహన్‌ లాల్‌ రికార్డుని `కొత్త లోక` బ్రేక్‌

దుల్కర్ వేఫరర్ ఫిలిమ్స్ నిర్మించిన ఏడవ చిత్రం 'లోక - చాప్టర్ వన్: చంద్ర'  (కొత్త లోక) బుక్ మై షోలో రికార్డ్ సృష్టించింది. ఒక మలయాళ చిత్రానికి బుక్ మై షో ద్వారా అత్యధిక టికెట్ అమ్మకాలను ఈ మూవీ సాధించింది. 18 రోజుల్లో 4.52 మిలియన్ టిక్కెట్లు ఈ సినిమాకి బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడయ్యాయి. 4.51 మిలియన్ టిక్కెట్లను బుక్ మై షో ద్వారా అమ్మిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 'తుడరుమ్' చిత్రం రికార్డును 'లోక' బద్దలు కొట్టింది.

24
కొత్త లోక బాక్సాఫీసు కలెక్షన్లు

బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్‌ అవుతోన్న ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.250 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించింది. మలయాళంలో ఈ ఘనత సాధించిన రెండవ చిత్రంగా 'లోక' నిలిచింది. విడుదలైన 19 రోజుల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం. మలయాళంలో విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం ఇంకా వసూళ్లను రాబడుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నెస్లెన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించారు.

34
కల్లింగట్టు నీలి కథ నుంచి ప్రేరణతో `కొత్త లోక`

భారతదేశంలో ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.  తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లు కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్, మంచి బాక్సాఫీస్ వసూళ్లను సాధించాయి. భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్, టొవినో తదితరులు అతిథి పాత్రల్లో నటించారు. 5 భాగాల సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది మొదటి చిత్రం. కేరళలో ప్రసిద్ధి చెందిన కథ అయిన కల్లింగట్టు నీలి కథ నుండి ప్రేరణ పొంది ఈ మూవీని అద్భుతమైన విజువల్‌ వండర్‌గా, సూపర్‌ హీరో మూవీగా తెరకెక్కించారు. 

44
`లోక` కాస్ట్ అండ్‌ క్రూ డిటెయిల్స్

చందు సలీం కుమార్, అరుణ్ కురియన్, శరత్ సభ, నిశాంత్ సాగర్, విజయ రాఘవన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. కేరళలో ఈ చిత్రాన్ని వేఫరర్ ఫిలిమ్స్ విడుదల చేసింది. కెమెరా - నిమిష్ రవి, సంగీతం - జేక్స్ బిజోయ్, ఎడిటర్ - సామాన్ శాఖో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - జోమ్ వర్గీస్, బిపిన్ పెరంపల్లి, అదనపు స్క్రీన్ ప్లే - శాంతి బాలచంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ - బంగ్లాన్, ఆర్ట్ డైరెక్టర్ - జిత్తు సెబాస్టియన్, మేకప్ - రోనాక్స్ జేవియర్, కాస్ట్యూమ్ డిజైనర్ - మెల్వి జె, అర్చన రావ్, ఫోటోగ్రఫీ - రోహిత్ కె సురేష్, అమల్ కె సదర్, స్టంట్ డైరెక్టర్ - యానిక్ బెన్, ప్రొడక్షన్ మేనేజర్ - రిని దివాకర్, వినోష్ కైమల్, చీఫ్ అసిస్టెంట్ - సుజిత్ సురేష్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories