OTT Movies: ఓటీటీలో కాంతార 1కి కల్యాణి ప్రియదర్శన్ లోక చిత్రం షాకిచ్చింది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ అలా ఎందుకు జరిగింది, లోక చిత్ర జోరుకి కారణం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై విడుదలైన సినిమాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. లోక: చాప్టర్ 1 చంద్ర, కాంతార: చాప్టర్ 1, బాఘీ 4 , ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు) వంటి చిత్రాలు వరుసగా జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. అయితే, ఇప్పటికే అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా ఈ పోటీలో తన స్థానం నిలబెట్టుకుంది. ఇంకా ఓజీ జోరు తగ్గలేదు.
25
జోరు తగ్గని ఓజీ
ఓరామాక్స్ తాజా నివేదిక ప్రకారం, పవన్ కళ్యాణ్ నటించిన ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 మధ్య 3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది మొదటి వీకెండ్ వ్యూస్ తో సమానంగా ఇప్పుడు కూడా ఓజీ వ్యూస్ సాధిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషా ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది.
35
ఒకేసారి ఓటీటీలోకి వచ్చిన కాంతార1, లోక
మరోవైపు ఓజీ తర్వాత ఓటీటీలో రిలీజైన కాంతార చాప్టర్ 1, లోక చాప్టర్ 1 చంద్ర చిత్రాలు కూడా ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఈవారం థియేటర్లలో ఆసక్తికర సినిమాలు రిలీజ్ కాలేదు. రవితేజ నుంచి వచ్చిన మాస్ జాతర కూడా నిరాశపరిచింది. దీనితో ఆడియన్స్ కి ఓజీ, కాంతార1, లోక చిత్రాలతో ఓటీటీ బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు లోక: చాప్టర్ 1 చంద్ర, కాంతార: చాప్టర్ 1. రెండు సినిమాలు ఒకే రోజున ఓటీటీలో విడుదలయ్యాయి. జియోహాట్‌స్టార్‌లో లోక: చాప్టర్ 1 చంద్ర, ప్రైమ్ వీడియోలో కాంతార: చాప్టర్ 1 స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి.
లోకహ్: చాప్టర్ 1 చంద్ర ఒక సూపర్ హీరో థీమ్‌తో రూపొందిన చిత్రం కాగా, ఇందులో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా అదరగొట్టారు. మరోవైపు, కాంతార: చాప్టర్ 1 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. పౌరాణిక నేపథ్యం, గ్రామీణ కథాంశం, ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రికార్డు స్థాయిలో ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
55
కాంతార 1కి లోక షాక్
కానీ, తాజా ఓరామాక్స్ రిపోర్ట్ ప్రకారం లోక: చాప్టర్ 1 చంద్ర ఓపెనింగ్ వీకెండ్‌లో కాంతార: చాప్టర్ 1ను అధిగమించింది. లోక 3.8 మిలియన్ వ్యూస్, కాంతార 1 చిత్రం 3.5 మిలియన్ వ్యూస్ సాధించాయి. కాంతార 1 కంటే లోక చిత్రం అత్యధిక వ్యూస్ సాధించడం ఆశ్చర్యమే. కానీ దానికి ఓ కారణం ఉంది. కాంతార1 ఇంకా హిందీ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాలేదు.