2026 లో విడుదలయ్యే భారీ బడ్జెట్ మూవీస్, ఈ 8 పాన్ ఇండియా సినిమాల గురించి తెలుసా ?

Published : Nov 03, 2025, 08:16 PM IST

2026 సంవత్సరం భారత సినీ ప్రియులకు పండగలా ఉండబోతోంది. ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, యశ్, రణబీర్ కపూర్ లాంటి అగ్ర తారలు నటిస్తున్న ఈ సినిమాలు భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి.

PREV
19
2026 భారతీయ సినిమాలు

2026లో విడుదల కానున్న కొన్ని సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు పెద్ద బడ్జెట్‌తో రూపొందుతుండటంతో భారత సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

29
1. రామాయణం

రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.

బడ్జెట్: రూ.800-900 కోట్లు

దర్శకుడు: నితేష్ తివారీ

నటీనటులు: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్

జానర్: పౌరాణిక డ్రామా

విడుదల: దీపావళి 2026

39
2.అల్లు అర్జున్, అట్లీ మూవీ

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో అంతరిక్షం, పార్లల్ యూనివర్స్ లాంటి అంశాలు ఉంటాయట. ఈ మూవీ 2026 ఎండింగ్ లో లేదా 2027 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 

బడ్జెట్: రూ.800 కోట్లు

దర్శకుడు: అట్లీ

నటీనటులు: అల్లు అర్జున్, దీపికా పదుకొణె

జానర్: యాక్షన్-అడ్వెంచర్, సైన్స్-ఫిక్షన్

విడుదల: 2026 (తేదీ ప్రకటించలేదు)

49
3. డ్రాగన్

సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

బడ్జెట్: రూ.500-600 కోట్లు

దర్శకుడు: ప్రశాంత్ నీల్

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, రుక్మిణి వసంత్, టోవినో థామస్, అనిల్ కపూర్

జానర్: యాక్షన్-క్రైమ్ డ్రామా

విడుదల: 2026 (తేదీ ప్రకటించలేదు)

59
4. ఫౌజీ

బ్రిటిష్ రూలింగ్ టైంలో ఒంటరిగా పోరాడిన వీరుడి కథగా ఫౌజీ తెరకెక్కుతోంది. వరల్డ్ వార్ 2 అంశాలు ఈ చిత్రంలో ఉంటాయట. 

బడ్జెట్: రూ.600 కోట్లు

దర్శకుడు: హను రాఘవపూడి

నటీనటులు: ప్రభాస్, ఇమాన్వీ, మిథున్ చక్రవర్తి, జయప్రద

జానర్: పీరియాడిక్ యాక్షన్ డ్రామా

విడుదల: 2026 (తేదీ ప్రకటించలేదు)

69
7. పెద్ది

ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ అంశాలతో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రంగస్థలం సినిమాని మించేలా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. 

బడ్జెట్: రూ.400 కోట్లు

దర్శకుడు: బుచ్చిబాబు సానా

నటీనటులు: రాంచరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్

జానర్: పీరియాడిక్ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా

విడుదల: మార్చి 27, 2026

79
5. టాక్సిక్ (కన్నడ)

కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

బడ్జెట్: రూ.300 కోట్లు

దర్శకుడు: గీతూ మోహన్‌దాస్

నటీనటులు: యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్

జానర్: గ్యాంగ్‌స్టర్ కథ

విడుదల: మార్చి 19, 2026

89
6. కింగ్

పఠాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. షారుఖ్ ఖాన్ హీరోగా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడిగా ఈ చిత్రం రూపొందుతోంది. 

బడ్జెట్: రూ.200 కోట్లు

దర్శకుడు: సిద్ధార్థ్ ఆనంద్

నటీనటులు: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్

జానర్: యాక్షన్-థ్రిల్లర్

విడుదల: 2026 (తేదీ ప్రకటించలేదు)

99
8. ది ప్యారడైజ్

దసరా చిత్రం సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని మరోసారి చేతులు కలిపారు. ఈ మూవీలో నాని మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్: రూ.150 కోట్లు

దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల

నటీనటులు: నాని, సోనాలి కులకర్ణి

జానర్: యాక్షన్-అడ్వెంచర్

విడుదల: మార్చి 26, 2026

Read more Photos on
click me!

Recommended Stories