చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున నలుగురితో రొమాన్స్ చేసి పెళ్లి కాకుండా ఉండిపోయిన హీరోయిన్.. కారణం అతడేనా

Published : Nov 03, 2025, 09:03 PM IST

తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో నటించి పెళ్లి కాకుండా ఉండిపోయిన హీరోయిన్ ఒకరున్నారు. తనకి పెళ్లి కాకపోవడానికి ఓ బాలీవుడ్ హీరో కారణం అంటూ ఆమె కామెంట్స్ చేశారు. 

PREV
14
ఆ నలుగురితో రొమాన్స్ చేసిన నటి

బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన టబు నవంబర్ 4న తన జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకోనుంది. ఇది ఆమెకి 54వ పుట్టిన రోజు. అయినా ఇంకా టబు సింగిల్ గానే ఉండిపోయింది. టబు హిందీతో పాటు దక్షణాది భాషల్లో కూడా నటించి గుర్తింపు పొందింది. తెలుగు లో టబు కూలీ నెంబర్ 1, నిన్నే పెళ్లాడతా, అందరివాడు, చిన్న కేశవ రెడ్డి లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నలుగురితో రొమాన్స్ చేసింది. 

24
అజయ్ దేవగన్ వల్లే పెళ్లి కాలేదు

టబు, నాగార్జున మధ్య ఎఫైర్ సాగింది అని అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. నిన్నే పెళ్లాడతా మూవీలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, టబు మధ్య కూడా ప్రేమాయణం సాగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చిన్నతనం నుంచి టబు, అజయ్ దేవగన్ లకు పరిచయం ఉంది. టబుతో అబ్బాయిలు ఎవరూ మాట్లాడకుండా అజయ్ దేవగన్ కట్టడి చేసేవారట. ఎవరైనా మాట్లాడితే అతడిని అజయ్ దేవగన్ కొట్టేవారని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. తనకి పెళ్ళెందుకు కావడం లేదో ఇప్పుడు అర్థం అవుతోంది అంటూ టబు ఫన్నీగా కామెంట్స్ చేసింది. 

34
వయసు పెరుగుతున్నా తరగని అందం

53 ఏళ్ల వయసులోనూ టబు తన అందం, ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారమే తన ఫిట్‌నెస్ రహస్యమని, ఇటీవల బాదం బ్రెడ్ తింటున్న ఫోటోను పంచుకుంది.

44
ఏజ్ నంబర్ మాత్రమే 

ప్రతిభ, అందం, సాధారణ జీవనశైలితో టబు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. సినిమా ప్రపంచంలో వయసు కేవలం ఒక సంఖ్య అని ఆమె నిరూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories