7 ఏళ్ల తర్వాత 700 కోట్ల సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published : Feb 25, 2025, 02:00 PM IST

బాహుబలి, ఆర్ఆఆర్ఆర్, కల్కీలను మించి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. 700 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఆస్టార్ దర్శకుడు ఎవరు? 

PREV
16
7 ఏళ్ల తర్వాత 700 కోట్ల సినిమాతో రీ  ఎంట్రీ ఇస్తోన్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
పొన్నర్ శంకర్:

కోలీవుడ్ కు భారీ బడ్జెట్ సినిమాలు కలిసిరావడంలేదు. చారిత్రాత్మక సినిమాలు కూడా సక్సెస్ ను ఇవ్వడంలేదు.  చాలా కాలంగా దర్శకులు భారీ బడ్జెట్‌తో చారిత్రక కథలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కళైంజర్ దర్శకత్వంలో ప్రశాంత్ ద్విపాత్రాభినయంలో నటించిన 'పొన్నర్ శంకర్' సినిమాతో ఈ సినిమాలవైపు అడుగులు వేశారు దర్శకులు. కాని కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాలు ఆడటంలేదు. 

Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?

26
రాజమౌళి బాహుబలి:

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా రూ.500 కోట్ల బడ్జెట్‌తో విడుదలై సూపర్ హిట్ అయింది. బాహుబలి సెకండ్ పార్ట్ మూవీ అయితే 1800 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయం తర్వాత మణిరత్నం తన 20 ఏళ్ల కలల సినిమా పొన్నియన్ సెల్వన్ ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు వసూలు చేయగా, రెండో భాగం రూ.350 కోట్లు వసూలు చేసింది.

Also Read: నాగ చైతన్య కంటే ముందు సమంత ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? అతనితో బ్రేకప్ ఎలా అయ్యింది?

 

36
కంగువా

ఇదే తరహాలో హిస్టారికల్, ఫాంటసీ కథాంశంతో వచ్చిన సినిమా 'కంగువా'. రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. సినిమా బాగున్నప్పటికీ, మొదటి అరగంటలో కథ నెమ్మదించడం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో శబ్దం రావడం ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడానికి కారణమయ్యాయి. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉండగా... రూ.200 కోట్లు కూడా వసూలు చేయకపోవడం తో  అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

Also Read: శ్రీదేవి పై విషప్రయోగం జరిగిందా ? స్టార్ హీరోయిన్ ను ప్లాన్ చేసి చంపింది ఎవరు? 7 ఏళ్ళ మిస్టరీ వెనుక నిజమెంత?


 

46
దర్శకుడు లింగుస్వామి

వాటన్నింటినీ మించేలా ఇప్పుడు రూ.700 కోట్లతో కొత్త సినిమా తీయనున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు దర్శకుడు  లింగు స్వామి. మమ్ముట్టి, మురళి, అబ్బాస్, స్నేహ, దేవయాని, రంభ తదితరులు నటించిన ఆనందం 2001లో విడుదలైంది. ఈ సినిమాతో లింగుస్వామి దర్శకుడిగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత రన్, జీ, సండకోళి, భీమా, పయ్యా, వేట్టై, అంజాన్, సండకోళి 2, ది వారియర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి

56
పందెం కోడి 2 :

చివరిగా తమిళంలో పందెంకోడి  2 సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆయనకు హిట్ ఇవ్వలేదు.  మధ్యలో టాలీవుడ్ లో హీరో రామ్ తో ది వారియర్ సినిమా చేసినా.. అది కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈతమిమళంలో దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా బడ్జెట్ రూ.700 కోట్లు అని అంటున్నారు. 

66
అర్జునుడు, అభిమన్యుడు :

అంతేకాదు, ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2గా రెండు భాగాలుగా రానుందట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జునుడు, అభిమన్యుడు అనే ఇద్దరు పాత్రలతో రెండు భాగాలుగా సినిమా తీయబోతున్నాను. ఈ సినిమాకు రూ.700 కోట్లు బడ్జెట్. కొత్త టెక్నాలజీతో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే మహాభారతంకు సంబంధించిన సీరియల్స్ వచ్చినా అర్జునుడు, అభిమన్యుడి కథ ఆధారంగా ఈ సినిమా ప్రత్యేకంగా రూపొందనుంది అని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని భావిస్తున్నారు.

 

Read more Photos on
click me!

Recommended Stories