ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?

Published : Feb 25, 2025, 11:41 AM IST

ప్రభాస్ ఫస్ట్ సినిమా నుంచి పాన్ ఇండియా హీరోగా ఎలా ఎదిగాడో అందకి తెలిసిందే. అయితే ప్రభాస్ తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడని మీకు తెలుసా? మరి అతను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు. అతను చేసిన సినిమా ఏది? ఇంతకీ ఆ హీరో ఎవరు? 

PREV
16
ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?

ప్రభాస్ ఎప్పుడో 2001 లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి.. 2015 వరకూ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. బాహుబలి తరువాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగింది. వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.

Also Read: శ్రీదేవి కి విషం ఇచ్చి చంపారా ? 7 ఏళ్లైనా వీడని మిస్టరీ, సంచలన విషయాలు వెల్లడించింది ఎవరు?

26
Prabhas

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న ఈ స్టార్ హీరో.. వేల కోట్ల మార్కెట్ ను శాసిస్థున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా అరడజను సినిమాలకుపైగా తెరకెక్కతున్నాయి. ఈ ఆరు సినిమాలతో ఇండస్ట్రీలో  వేల కోట్ల బిజీనెస్ జరగబోతోంది. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభాస్. 

36

వందలకోట్ల రెమ్యునరేషన్ తో వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజు వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. అయితే  కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ ఒక్కడే వారి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చాడా.? ఇంకెవరు  ఆ ప్యామిలీలో హీరోలు లేరా అని అంటే.. ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చారు కూడా. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
 

46

 ప్రభాస్ కు తమ్ముడు ఉన్నాడు. అతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాని ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ప్రభాస్ లా గట్టిగా ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతకీ అతని పేరు ఏంటి? ఏం సినిమా చేశాడు. అని అనుమానం వచ్చి ఉంటుంది. అతను మరెవరో కాదు సిద్దార్ధ్ రాజ్ కుమార్. ఇతను ఎప్పుడో 2011 లోనే టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరటం  అనే సినిమా ద్వారా హీరో అయ్యాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అంతే కాదు ఈమూవీకి ప్రభాస్ తో పాటు కృష్ణం రాజు కూడా సపోర్ట్ గా ప్రచారం చేశారు. 

56

కాని ఈసినిమా సక్సెస్ అవ్వలేదు. అసలు వచ్చి వెళ్ళిన సంగతి కూడా ఎవరికి తెలియదు. దాంతో ఇండస్ట్రీలో రాజ్ కుమార్ నిలవలేకపోయారు. టాలీవుడ్ ను వదిలి బిజినెస్ వైపు వెళ్ళారట. వారి ఫ్యామిలీ బిజినెస్ లు అన్నీ అతనే చూసుకుంటున్నాడట. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 

66

హను రాఘవపూడితో ఫౌజీ మూవీ షూటింగ్ జరుగుతోంది. వీటితో పాటు సలార్ 2, కల్కీ2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీస్ కూడా అప్ డేట్ అవ్వాల్సి ఉంది. స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ ఉగాది నుంచి స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఐదారేళ్ళు ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. మరో రెండు సినిమాలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories