పవన్ కళ్యాణ్ సినిమాలో బాలీవుడ్ లెజండరీ స్టార్ యాక్టర్..? 'హరి హర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు..?

First Published | Aug 8, 2024, 7:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఎట్టకేలకు కదలిక రాబోతోంది. ఈమూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు నటించబోతున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. ఇంతకీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు..? ఆ బాలీవుడ్ నటుడు ఎవరు..? 

Hari Hara Veera Mallu

ఎలక్షన్లు.. ఆతరువాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తరువాత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక తన పెడ్డింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన హీరోగా సగంలో ఉన్న మూడు సినిమాలు కంప్లీట్ చేయబోతున్నాడు. అందులో భాగంగా తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సబంధించి కథలిక కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

సమంత - రష్మిక ఇన్స్టాగ్రామ్ లో టాప్ ఎవరు..? ఫాలోయింగ్ లో టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళే..?

పవన్ కళ్యాణ్ హీరోగా... పాన్ ఇండియా  రేంజ్ లో హరి హర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈసినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో.. పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందుతున్న ఈసినిమాకు సబంధించిన ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. 

42 ఏళ్ళ అల్లు అర్జున్ ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటి..? బన్నీ డైట్ లో అది తప్పనిసరి..?


హరిహర వీరమల్లు సినిమాకు  అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ ఇండియన్ యాక్టర్స్ లో  ఒకరైన అనుపమ్ ఖేర్ 'హరి హర వీరమల్లు'లో నటించబోతున్నారు. ఈసినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో ఆయన నటించబోతున్నట్టు ప్రకటన రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. 

నాగచైతన్య ‌‌- శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంత..? వీరి ప్రేమ ఎక్కడ మొదలయ్యిందో తెలుసా..?
 

ఈసినిమా దర్శకత్వ బాధ్యలనుంచి క్రిష్ తప్పుకుని.. రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు' చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను రిలీజ్ చేశారు.  ఈ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రత్యేక టీజర్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో, రెట్టింపు ఉత్సాహంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంతో మంది టాలెంటెడ్ టెక్నీషియన్స్  హరి హర వీరమల్లు'  సినిమాకోసం పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్. మనోజ్ పరమహంస ఈ మూవీలో మిగిలిన భాగం కంప్లీట్ చేయడానికి.. టీమ్ తో జాయిన్ అయ్యారు.  లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి మరియు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. 

ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు హీరిహర వీరమల్లు సినిమాను  ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే మిగిలిన భాగం చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉంది. అటు ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ ను బేస్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్" రిలీజ్ డేట్ ను కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. 

Latest Videos

click me!